PAN Card: పాన్‌ కార్డులో పేరు, చిరునామాను ఆన్‌లైన్‌లో ఇలా సులభంగా మార్చుకోండి.. వివరాలు..

How to change your name on PAN Card: ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఆర్థిక‌‌పరమైన లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల కోసం.. ఐటీ రిట‌ర్న్‌లు దాఖలు చేయడానికి

PAN Card: పాన్‌ కార్డులో పేరు, చిరునామాను ఆన్‌లైన్‌లో ఇలా సులభంగా మార్చుకోండి.. వివరాలు..
PAN Card
Follow us

|

Updated on: May 20, 2021 | 5:56 AM

How to change your name on PAN Card: ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఆర్థిక‌‌పరమైన లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల కోసం.. ఐటీ రిట‌ర్న్‌లు దాఖలు చేయడానికి పాన్‌కార్డు క‌చ్చితంగా ఉండాలి. అయితే పాన్‌కార్టు ఇప్పుడు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి పాన్ ‌కార్డు తీసుకున్నామంటే పాన్ నంబ‌ర్‌ను ఎప్పటికీ మార్చ‌లేం. అయితే పాన్ కార్డులో పేరు, సంత‌కం, ఇత‌ర వివ‌రాల్లో ఏమైనా త‌ప్పులు ఉంటే మాత్రం వాటిని అప్‌డేట్ చేసుకునే అవ‌కాశం మాత్రం కల్పించింది ప్రభుత్వం. సాధార‌ణంగా సొంత ఇళ్లు లేని వారు.. వేరే చోట పనిచేస్తున్నవారు వేరే అడ్రస్‌కు మారిపోతుంటారు. అలాంటి స‌మ‌యంలో పాన్ కార్డులో ఉన్న అడ్ర‌స్‌ను మీ ఇంట్లో నుంచే సులువుగా అప్‌డేట్ చేసుకునే స‌దుపాయం ఉంది. పాన్ కార్డులో అడ్ర‌స్‌ను, పలు వివరాలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా మార్చుకోవ‌చ్చు. అయితే ప్రస్తుతం అందరూ సులభమైన పద్దతి ఆన్‌లైన్‌లోనే మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

పాన్‌కార్డు వివరాలను ఆన్‌లైన్‌లో మార్చే పద్దతి..

‣ ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్ (https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html) ను ఓపెన్ చేయాలి. ‣ ఆన్‌లైన్ పాన్ అప్లికేష‌న్ పేజిలో Application Type పై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ‣ ఆ త‌ర్వాత Individual పై క్లిక్ చేసి పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ పూర్తిచేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ చేయాలి. ‣ కొత్త పేజిలో టోకెన్ నంబ‌ర్ వ‌స్తుంది. దాన్ని సేవ్ చేసుకుంటే మంచిది. ‣ Submit digitally through e-KYC & e-sign (paperless) ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ‣ దాని త‌ర్వాత కింద‌కి స్క్రోల్ డౌన్ చేసి వ్య‌క్తిగత వివ‌రాల‌ను నింపి next బ‌ట‌న్ క్లిక్ చేయాలి. ‣ అందులో మీరు మార్చాల‌నుకుంటున్న వ్యక్తిగత వివరాలు, అడ్ర‌స్‌ను త‌ప్పులు లేకుండా నింపాలి. ‣ మీ మొబైల్ నంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీని మార్చాల‌ని అనుకున్నా దీనిలో మార్చుకోవ‌చ్చు. ‣ అడ్ర‌స్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని స‌రిగ్గా ఇచ్చిన త‌ర్వాత పేజి కింద ఉన్న next బ‌ట‌న్ క్లిక్ చేయాలి. ‣ ఆ త‌ర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్ర‌స్‌, డేట్ ఆఫ్ బ‌ర్త్‌ ప్రూఫ్ డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాలి. ‣ అలాగే ఫొటో, సంత‌కం కూడా మార్చాలనుకున్నా.. స్కాన్ చేసి jpeg ఫార్మ‌ట్‌లో అప్‌లోడ్ చేయాలి. ‣ అనంత‌రం స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. ‣ అప్లికేష‌న్ స‌బ్‌మిట్ కాగానే.. అక‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ జ‌న‌రేట్ అవుతుంది. ఫోన్ నెంబర్‌కు, మెయిల్‌కు మెస్సెజ్ కూడా వస్తుంది. ‣ అనంతరం ఆ స్లిప్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ‣ ఆ తర్వాత అప్లికేష‌న్‌ను ప్రింట్ తీసి NSDL ఆఫీస్‌కు పంపించాలి.

ద‌ర‌ఖాస్తు పంపవలసిన చిరునామా..

Income Tax PAN‌ Services Unit, 5th Floor Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model colony, Near Deep Bungalow Chowk, Pune – 411 016

Also Read:

Bank Account: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!

Work From Home: వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? మీకోసం ప్రత్యేకంగా మొబైల్ డేటా ప్లాన్స్ అందిస్తున్న నెట్ వర్క్ ప్లాన్స్ ఇవే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు