
Google Top Trends: 2021 సంవత్సరానికి సంబంధించి సంబంధించి గూగుల్ టాప్ ట్రెండ్ గురించిన సమాచారాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం Googleలో ఎక్కువగా దేని గురించి వెతికారు? ఏం ప్రశ్నలు వెతికారు? ప్రజలు దేనిపై ఎక్కువ ఆసక్తి కనబరిచారు? వంటి వివరాలను ప్రకటించింది. 2020 నుంచి ఇప్పటి వరకు అన్నింటికంటే ప్రధాన అంశంగా కరోనా నిలిచింది. ఎందుకంటే.. ఈ సంవత్సరం కరోనా వైరస్ ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసింది. అందుకే కాబోలు.. ప్రజలు ఇంటర్నెట్‌లోనూ దీని గురించే ఎక్కువగా శోధించారు. గూగుల్ విడుదల చేసిన 2021 ట్రెండ్స్‌లో టాప్ ప్లేస్‌లో కరోనా నిలిచింది. కరోనాకు సంబంధించిన ప్రశ్నలే చాలా మంది వెతికినట్లు గూగుల్ తెలిపింది.
గూగుల్ సెర్చ్ రిపోర్ట్‌లో ‘వాట్ ఈజ్’, ‘హౌ టు’ కేటగిరీల వారీగా యూజర్లు గూగుల్‌లో శోధించారని గూగుల్ తెలిపింది. ‘వాట్ ఈజ్’కి సంబంధించి ప్రజలు ఎలాంటి ప్రశ్నలు వెతికారో ముందుగా తెలుసుకుందాం..
1) బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి?
2) వంద(100)కు కారకం ఏంటి?
3) తాలిబాన్ అంటే ఏంటి?
4) ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతోంది?
5) రెమ్‌డెసివిర్ అంటే ఏంటి?
6) 4 వర్గమూలం ఏంటి?
7) స్టెరాయిడ్ అంటే ఏంటి?
8) టూల్‌కిట్ అంటే ఏంటి?
9) స్క్విడ్ గేమ్ అంటే ఏంటి?
10) డెల్టా ప్లస్ వేరియంట్ అంటే ఏంటి?
అంటూ ఇలా ‘వాటి ఈజ్’ పదం పేరుతో సెర్చ్ చేశారని గూగుల్ తెలిపింది.
‘హౌ టు’కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే..
1) కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
2) వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
3) ఆక్సిజన్ స్థాయిని ఎలా పెంచాలి?
4) ఆధార్‌తో పాన్‌ను ఎలా లింక్ చేయాలి?
5) ఆక్సీజన్‌ను ఇంట్లో ఎలా తయారు చేయాలి?
6) భారతదేశంలో డాగ్ కాయిన్‌ను ఎలా కొనుగోలు చేయాలి?
7) బనానా బ్రెడ్‌ను ఎలా తయారు చేయాలి?
8) IPO కేటాయింపు స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
9) బిట్‌కాయిన్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
10) మార్కుల శాతాన్ని ఎలా లెక్కించాలి?
ఇలాంటి 20 ప్రశ్నలు గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచాయి. వీటిలోనూ కరోనాకు సంబంధించిన పదాలే టాప్ ప్లేస్‌ను ఆక్రమించాయని గూగుల్ వెల్లడించింది.
Also read:
Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!