Google Duo: ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్ నిలిచిపోనుందా?.. ఆ మెసేజ్ అందుకే వస్తోందా?..

|

Jan 26, 2021 | 10:28 PM

Google Duo: ప్రసిద్ధ గూగుల్ డ్యుయో యాప్ ఆ ఫోన్లలో ఇక కనిపించదా? నిర్ణీత ఫోన్లలో డ్యుయో యాప్ సేవలు నిలిచిపోనున్నాయా?

Google Duo: ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్ నిలిచిపోనుందా?.. ఆ మెసేజ్ అందుకే వస్తోందా?..
Follow us on

Google Duo: ప్రసిద్ధ గూగుల్ డ్యుయో యాప్ ఆ ఫోన్లలో ఇక కనిపించదా? నిర్ణీత ఫోన్లలో డ్యుయో యాప్ సేవలు నిలిచిపోనున్నాయా? ఆయా ఫోన్లకు వస్తున్న సందేశాలు ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. గూగుల్ సంస్థకు చెందిన డ్యుయో యాప్‌‌కు చాలామంది యూజర్లు ఉన్నారు. ఈ యాప్‌ ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ చేసిన మాట్లాడొచ్చు. అయితే తాజాగా గూగుల్ డ్యూయో కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ చేత ధృవీకరించబడని కొన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ సేవలు నిలిచిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హువావే బ్రాండ్‌కు చెందిన స్మార్ట్ ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

సదరు ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్‌ను ఓపెన్ చేయగానే సంబంధిత సందేశం వస్తోంది. డ్యుయో యాప్‌ను ఓపెన్ చేయగానే.. ‘త్వరలో డ్యుయో సేవలు ఆగిపోనున్నాయి. ఎందుకంటే మీరు గూగుల్‌ ధ్రువీకరించని డివైజ్‌‌ను ఉపయోగిస్తున్నారు. మీ ఖాతాను ఈ డివైజ్‌ నుంచి తొలగించడం జరుగుతుంది’ అనే సందేశం ఫోన్లలో కనిపిస్తోంది. దీనికి ప్రకారం.. హువావే సహా గూగుల్‌ చేత ధృవీకరించబడని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ సేవలు నిలిచిపివేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలాఉంటే.. గూగుల్ ధ్రువీకరించిన స్మార్ట్ ఫోన్లలో గూగుల్ డ్యుయో సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని సమాచారం. నోకియా శామ్‌సంగ్, వన్‌ప్లస్, వివో, ఒప్పోతో పాటు ఇతర బ్రాండ్లలో ఈ యాప్ సజావుగా పని చేస్తాయట.

Also read:

Budget 2021: బడ్జెట్‌లో రైతులకు శుభవార్త చెప్పనున్నారా?.. కిసాన్ సమ్మాన్ నిధిని భారీగా పెంచనున్నారా?..

Remote Voting: మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా సీఈసీ.. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా..