వాస్తు విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా భారతీయులకు వాస్తు విశ్వాసం ఎక్కువ. సొంతింటికే కాకుండా అద్దుకు తీసుకునే ఇంటి విషయంలోనూ వాస్తు పాటిస్తుంటారు. ఇక ప్రతీ అంశంలో వాస్తుకు ప్రాధాన్యత ఉన్నట్లే స్టడీ రూమ్ విషయంలో కూడా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. స్టడీ రూమ్ వాస్తు కచ్చితంగా చిన్నారుల ఆలోచన పనితీరుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ స్టడీ రూమ్‌లో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* వాస్తు శాస్త్రం ప్రకారం స్టడీ రూమ్‌ను ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేల ఇది సాధ్యం కాకపోతే.. తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాఉట చేసుకోవచ్చు. అయితే స్టడీ రూమ్‌ను ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిశలో ఎప్పుడూ చేయకూడదు.
* ఇక స్టడీ రూమ్‌లో విద్యార్థులు చదువుతున్న సమయంలో వారి ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది వారి మానసిక వికాసాన్ని మెరుగుపరుస్తుంది అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
* స్టడీ రూమ్‌లో వేసే రంగుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లైట్ కలర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి లైట్ కలర్స్‌ను ఉపయోగించుకోవాలి.ఇది మనసు ప్రశాంతంగా ఉండి చదువుపై ఏకాగ్రత పెరగడంలో ఉపయోగపడుతుంది.
* అన్నింటికంటే ముఖ్యంగా స్టడీ రూమ్‌లో వెలుతురు, స్వచ్ఛమైన గాలి ఉండేలా చూసుకోవాలి. ఇది చిన్నారు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. మనస్సు కూడా ప్రశాంతంగా, రిఫ్రెష్‌గా మార్చడంలో ఉపయోగపడుతుంది.
* ఇక వీలైనంత వరకు విద్యార్థులు ఉదయం 4.30 గంటల నుంచి 10 గంటల వరకు చదువుకోవడం శ్రేయస్కరం. రాత్రి ఎక్కువసేపు చదువుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
* స్టడీ రూమ్‌లో ఏర్పాటు చేసే చిత్ర పటాల విషయంలోనూ కొన్ని నిబంధనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రకృతి సంబంధించిన ఫొటోలను ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..