Royal Bengal Tiger: రూపంలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం…పొగరుకు మారుపేరు.. పెద్ద పులి గురించి స్టన్నింగ్ విషయాలు

దాని భీకర రూపం చూస్తే చాలు.. పై ప్రాణాలు పైనే పోతాయ్‌. దాని గాండ్రింపు వింటే గాలి కూడా భయపడి.. వెయ్యిరెట్లు ఎక్కువ వేగంతో పరుగులు పెడుతుంది. దాని రాజసాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు, దర్పాన్ని తక్కువ చేసే సాహసమూ చేయలేం. అందుకే, అదే రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ అయ్యింది.

Royal Bengal Tiger: రూపంలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం...పొగరుకు మారుపేరు..  పెద్ద పులి గురించి స్టన్నింగ్ విషయాలు
Bengal Tiger

Updated on: Jun 05, 2022 | 12:33 PM

Bengal tiger lifespan: రూపంలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం…పొగరుకు మారుపేరు..మృగరాజుకు తీసిపోని దర్పం.. వన్య మృగాల్లో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌.. వెరీ పవర్‌ఫుల్‌ అండ్‌ వెరీ స్పెషల్‌. ఆ స్థాయి సామర్థ్యం కలిగి ఉంది కాబట్టే.. వన్యమృగాల్లో అది రాయల్‌ అయ్యింది. భారతీయ పులిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ చారల పులి… వెరీ పవర్‌ ఫుల్‌ అండ్‌ వెరీ స్పెషల్‌ అన్నది వన్య మృగాల పరిశోధలు చెప్పేమాట. కౄరత్వానికి కేరాఫ్‌లా కనిపించే రాయల్ బెంగాల్ టైగర్ స్పెషాలిటీ మామూలుగా ఉండదు. పొగరు అనే పదానికి రూపం ఉంటే అది బెంగాల్ బెబ్బులేనని చెప్పాలి. దూకుడు అనే పదానికి సరైన అర్థం చెప్పాలంటే అంటే బెంగాల్‌ టైగర్‌ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి, బెంగాల్‌ టైగర్‌ చరిత్ర ఈనాటిది కాదు. 12వేల ఏళ్ల క్రితమే ఇవి భారత భూ భాగంలోకి అడుగుపెట్టాయని చరిత్రకారులు చెబుతున్నారు. డైనోసర్‌(Dinosaur) కాలం నాటి సేబర్‌ టూత్‌ అలియాస్‌ స్పిలో డాన్‌కు వారసులే ఈ బెంగాల్‌ టైగర్సని నిపుణులు చెబుతున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ ఆనవాళ్లు ప్రాచీన కాలంలో శ్రీలంక(Sri Lanka)లో గుర్తించారని తెలుస్తోంది.

పాంథేరా టైగ్రిస్ అనేది బెంగాల్‌ టైగర్‌కు ఉన్న మరో పేరు. మగ పులులయితే 200 నుంచి300 కిలోల బరువుంటాయి. ఆడవైతే.. 100 నుంచి 181 కిలోలు ఉంటాయి. మగ పులుల ఎత్తు 8-10 అడుగులు.. ఆడ పులుల ఎత్తు 8-9 అడుగులు ఉంటుంది. గతంలో వీడి బరువు వెయ్యి కిలోల దాకా ఉండేదట. కాలక్రమంలో వాతావరణ మార్పులు, ఇతరత్రా కారణాలతో… ఆధునిక బెంగాల్‌ టైగర్ల బరువు బాగా తగ్గిపోయిందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈ రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌ జీవన విధానం విభిన్నంగా ఉంటుంది. ఈ పులులు సమూహాలుగా జీవిస్తాయి. ఈ టైగర్లు చెట్లను కూడా ఎక్కగలుగుతాయి. నీటిలో ఈదే సత్తా కూడా వీటికి ఉంది. మొత్తంగా 25 ఏళ్ల లైఫ్‌ స్పాన్‌ కలిగిన ఈ పులులు.. ఎంత పవర్‌ ఫుల్‌ అంటే, ప్రత్యర్థి ఎంత శక్తి వంతమైనదైనా సరే.. బరిలో దిగాయంటే చీల్చి చెండాడేస్తాయి. సింహం సింగిల్‌ పంచ్‌లో ఒకటిన్నర టన్నుల పవర్‌ ఉంటే.. ఈ బెంగాల్‌ టైగర్‌ పంజాకు మూడున్నర టన్నుల పవర్‌ ఉంటుందని సమాచారం. రూపంలో రాజసం, బలం, చురుకుదనం, అపారమైన శక్తి కారణంగానే ఇది భారత జాతీయ జంతువుగా అవతరించింది. “ప్రాజెక్ట్ టైగర్” ప్రారంభంతో బెంగాల్ టైగర్‌ను… 1973 ఏప్రిల్‌లో భారత జాతీయ జంతువుగా ప్రకటించారు. ఈ రాయల్ బెంగాల్ టైగర్ ఉనికి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, టిబెట్, మయన్మార్‌లలోనూ కనిపిస్తుంది.

  • సింహాలకంటే పొడువుగా ఉండే ఈ పులులు.. ఒకేసారి 30 నుంచి 40 కిలోల మాంసాన్ని తినేస్తాయి. వీటి వేటాడే స్టయిల్‌ కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. మిగతా జంతువుల శబ్దాలను అనుకరించి మభ్యపెట్టి దాడి చేస్తాయి. గంటకు 60 కి.మీ వేగంతో పరుగెత్తుతూ.. భయంకరంగా షికారు పూర్తి చేస్తాయి. మనుషుల్లో ఉండే వైవిధ్యం, ప్రత్యేక రూపు మాదిరిగానే.. బెంగాల్‌ టైగర్స్‌లోనూ వైవిధ్యత కనిపిస్తుంది. రాయల్ బెంగాల్ టైగర్ శరీరంపై చారలుంటాయి. అయితే, ఏ రెండు బెంగాల్‌ టైగర్లు ఒకే విధంగా ఉండకపోవడం విశేషం. మనుషుల వేలి ముద్రల్లానే పులుల చారలు కూడా దేనికదే ప్రత్యేకమన్నమాట..
  • కిల్లర్స్ గా సహజ లక్షణాలను కలిగివున్న పులులు.. ప్రత్యర్థి శరీరంలో ఏ భాగంపై దాడిచేస్తే ప్రాణం త్వరగా పోతుందన్న విషయం.. వాటికి బాగా తెలుసు. అంతేకాదు, ఈ టైగర్లు పరస్పరం పోట్లాడేటప్పుడు గాండ్రించవు. బదులుగా ఉక్రోషంతో బుసబుసమని శబ్ధం చేస్తాయి. ఒకవేళ టైగర్లు దూరం దూరంగా ఉంటే… గాండ్రింపులతో సంకేతాలు ఇచ్చి పుచ్చుకుంటాయి. అయితే, ఇళ్లలో ఉండే పిల్లుల మాదిరి.. తన పిల్లలను నోటకరుచుకుని ఇంకో ప్రాంతానికి తీసుకుపోయే లక్షణాలు ఈ రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌లో చూడొచ్చు. ఆడపులులు, పిల్లలు తిన్న తర్వాతే.. వేటాడిన ఆహారాన్ని మగ పులులు తింటాయి.
  • రాయల్ బెంగాల్ టైగర్లు.. మడ అడవులు ప్రత్యేకంగా ఉంటే పశ్చిమ బెంగాల్లోని సుందర్ బన్ ఫారెస్ట్ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. బెంగాల్‌ టైగర్‌ చూపులో.. తీక్షణత కన్పిస్తుంది. రాత్రుల్లో మనుషులు చూసే దూరంకంటే 6 రెట్లు ఎక్కువగా చూసే సామర్థ్యం వీటి సొంతం. వినికిడి శక్తి కూడా మనిషి కంటే వీటికి 5 రెట్లు ఎక్కువే. రాయల్ బెంగాల్ టైగర్ గాండ్రిస్తే.. 2 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందంటే ఆ పవరేంటో అర్థం చేసుకోవచ్చు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే… మిగతా జంతువులు, మనుషులకంటే జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక్కసారి చూసిన ముఖాలను రాయల్ బెంగాల్ టైగర్ మరిచిపోదట.
  • సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్ శరీరతత్వాన్ని కలిగివున్న రాయల్ బెంగాల్ టైగర్… గాయమైతే తన లాలాజలంతో నయం చేసుకుంటుంది. నాలుకతో ఆ గాయాన్ని నాకడమే మందన్నమాట. జింకలు, అడవి పంది, వాటర్ బఫెలో వంటి జంతువులను వేటాడుతుంది. అవసరమైతే తప్ప మనుషులపై దాడి చేయదని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న మాట. ఈ పులులు తమ సరిహద్దులను నిర్ణయించుకోవడానికి, తాము ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో మాత్రమే మూత్రవిసర్జన చేస్తాయి. ఆ సరిహద్దుల నడుమ ఉన్న ప్రాంతాన్నే తమ రాజ్యంగా పరిగణిస్తాయి. మగ పులి రాజ్యం విస్తీర్ణం దాదాపు 60-100 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఆడపులి రాజ్యం విస్తీర్ణం దాదాపు 20 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది.