Kitchen Hacks: బిజీ లైఫ్‌లోనూ కిచెన్ పనులని సులభంగా పూర్తి చేయండిలా..!

మనలో కొంతమందికి కిచెన్ లో కొన్ని విషయాలు తెలియక చాలా సింపుల్ పనులు కూడా పెద్దగా కనిపిస్తుంటాయి. వాటికి సంబంధించిన కొన్ని లాజిక్ లు తెలియక ఇలా అవుతుంటుంది. ఇలాంటి వారికోసమే కొన్ని సింపుల్ టిప్స్ తీసుకొచ్చాను. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Hacks: బిజీ లైఫ్‌లోనూ కిచెన్ పనులని సులభంగా పూర్తి చేయండిలా..!
Easy Kitchen Hacks For Daily Cooking

Updated on: Jan 30, 2025 | 11:04 PM

ప్రస్తుతం అందరి జీవితాలు బిజీ బిజీగా గడిచిపోతున్నాయి. రోజువారీ పనుల విషయంలో బాగా గందరగోళంగా ఉంటుంది. ఈ పనులను త్వరగా పూర్తి చేసేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. కిచెన్‌లో మీ పనులు చాలా ఈజీగా అయిపోతాయి.

టమాటాలను స్టోర్ చేయడం

టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడి వాసన కూడా మారిపోతుంది. దీని బదులుగా వాటిని గాలి తగిలే డబ్బాలో బయటే ఉంచడం మంచిది. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచాల్సి వస్తే.. వండే ముందు కనీసం గంటకు ముందు తీసి గోరువెచ్చని నీటిలో ఉంచితే మృదువుగా మారుతాయి.

మసాలాలు స్టోర్ చేయడం

మసాలా దినుసులను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే అందులో కొద్దిగా ఉప్పు కలపాలి. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ తేమను ఆకర్షించి, మసాలా పదార్థాలు పొడిగా, తాజాగా ఉండేలా చేస్తుంది.

పాలమీగడ కోసం

బాగా మరిగించిన పాలను చల్లారనిచ్చి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. రెండు గంటల తర్వాత చూస్తే పాలమీగడ మెల్లగా పైకి తేలి మృదువైన లేయర్‌గా మారుతుంది. ఇలా చేస్తే పాలమీగడను సులభంగా తీయచ్చు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే కిచెన్ పని మరింత సులభంగా వేగంగా పూర్తవుతుంది.

నిమ్మరసం ఎక్కువగా రావాలంటే

కొన్నిసార్లు నిమ్మకాయ గట్టిపడి రసం తక్కువగా వస్తుంది. అలా కాకుండా 20 సెకన్ల పాటు మైక్రోవేవ్‌లో వేడి చేయండి. ఇలా చేయడం వల్ల లోపల నున్నగా మారి ఎక్కువ రసం వస్తుంది. మైక్రోవేవ్ లేకుంటే గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నిమ్మకాయలు ఉంచి తర్వాత పిండితే రసం బాగా వస్తుంది.