Vastu Tips: డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..

|

Sep 02, 2024 | 7:15 PM

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు వర్తిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఏ దిశలో ఉండాలో స్పష్టంగా తెలిపారు. పొరపాటున తప్పుడు దిశలో వస్తువులను ఏర్పాటు చేస్తే మంచిది కాదని సూచిస్తుంటారు. దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో డైనింగ్‌ టేబుల్ ఉంటుందని...

Vastu Tips: డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
Vastu Tips
Follow us on

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు వర్తిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఏ దిశలో ఉండాలో స్పష్టంగా తెలిపారు. పొరపాటున తప్పుడు దిశలో వస్తువులను ఏర్పాటు చేస్తే మంచిది కాదని సూచిస్తుంటారు. దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో డైనింగ్‌ టేబుల్ ఉంటుందని తెలిసిందే. అయితే డైనింగ్‌ టేబుల్‌పై ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల వస్తువులను పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డైనింగ్ టేబుల్‌ అనేది కేవలం ఆహారానికి సంబంధించి వస్తువులు పెట్టుకునే స్థలం. దీనిపై ఎలాంటి అలంకరణ వస్తువులను కానీ, ఇతర వస్తువులను కాని పెట్టకూడదని వాస్తు పిండితులు చెబుతున్నారు. పొరపాటున ఇతర వస్తువులు పెడితే వాస్తు దోషం తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. డైనింగ్ టేబుల్‌పై కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది.

మనలో చాలా మంది డైనింగ్స్ టేబుల్స్‌పై తాళం చెవిలను పెడుతుంటారు. అయితే అస్సలు మంచి అలవాటు కాదని అంటారు. దీనివల్ల ఎనగిటివ్‌ ఎనర్జీ పరిగే అవకాశం ఉంటుంది. అలాగే డైనింగ్ టేబుల్స్‌పై మందులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో ఉండే వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతన్ఆనరు.

ఇక డైనింగ్ టేబుల్‌పై ఉండకూడని మరో వస్తువు పుస్తకాలు. చాలా మంది పొరపాటున పుస్తకాలు పెడుతుంటారు. ఇది కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. డైనింగ్ టేబుల్‌పై కూర్చొని చదవడం, రాయడం లాంటివి చేయకూడదని అంటున్నారు. వీటితోపాటు డైనింగ్ టేబుల్స్‌పై ఎట్టి పరిస్థితుల్లో కత్తుల వంటి పదునైన వస్తువులను పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే డైనింగ్ టేబుల్‌పై ఆర్టిఫిషియల్‌ ఫ్రూట్స్‌ను పెట్టకూడదు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి…