అత్యంత తెలివైన జీవి.. 9 మెదళ్లు, 3 గుండెలతో పుట్టింది! చాలా మందికి తెలియని అద్భుతం

ఈ జీవికి మూడు గుండెలు, ఒక ప్రధాన మెదడుతో పాటు ఎనిమిది చేతుల్లో ఎనిమిది నాడీ కేంద్రాలు ఉంటాయి. రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని పంపగా, మూడోది శరీరమంతా పంపుతుంది. ప్రతి చేయి స్వతంత్రంగా పనిచేయడం వల్ల అత్యంత తెలివైన సముద్ర జీవిగా గుర్తింపు పొందింది.

అత్యంత తెలివైన జీవి.. 9 మెదళ్లు, 3 గుండెలతో పుట్టింది! చాలా మందికి తెలియని అద్భుతం
Octopus Heart And Brain

Updated on: Aug 01, 2026 | 11:24 AM

సాధారణంగా మనుషులకు, జంతువులకు అయినా ఒకే గుండె, ఒకే మెదడు ఉంటుందని అనుకుంటాం. గుండె కొట్టుకుంటూ ఉంటే ప్రాణం ఉన్నట్లు. అలాగే మెదడు చెప్పినట్లే శరీరం నడుచుకుంటుంది. ఇలాంటి విషయాలు అందరికీ తెలినవే. అయితే ఓ జీవికి మాత్రం ఏకంగా 9 మెదళ్లు, 3 గుండెలు ఉంటాయ్. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి అవి ఎలా పనిచేస్తాయ్, ఆ జీవి ఏది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సముద్ర జీవుల్లో అత్యంత తెలివైన జీవిగా పేరొందిన ఆక్టోపస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వినిపించే విషయం.. ఆక్టోపస్‌కు మూడు గుండెలు, తొమ్మిది మెదళ్లు ఉంటాయి అనేది. ఇది పూర్తిగా నిజమే. అయితే మనుషుల్లా తొమ్మిది పూర్తి స్థాయి మెదళ్లు ఉండవు. దాని శరీర నిర్మాణం, నాడీ వ్యవస్థ కారణంగానే ఈ ప్రత్యేకత వచ్చింది.

మూడు గుండెలు ఎందుకు ఉంటాయి?

ఆక్టోపస్‌కు మొత్తం మూడు గుండెలు ఉంటాయి. వీటిలో రెండు గుండెలు రక్తాన్ని మొప్పలకు (Gills) పంపించి ఆక్సిజన్ అందిస్తాయి. మూడో గుండె ఆ ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరమంతా పంపుతుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆక్టోపస్ ఈదుతున్నప్పుడు ప్రధాన గుండె పనితీరు తగ్గుతుంది. అందుకే అవి ఎక్కువగా సముద్ర అడుగున పాకుతూ సంచరిస్తాయి.

ఇది కూడా చదివేయండి: అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..

9 మెదళ్లు

ఆక్టోపస్‌కు ఒక ప్రధాన మెదడు ఉంటుంది. మిగిలిన ఎనిమిది చేతుల్లో ఒక్కో నాడీ కేంద్రం ఉంటుంది. వీటిని సాధారణంగా చేతి మెదళ్లు అని పిలుస్తారు. ఇవి పూర్తి స్థాయి మెదళ్లు కాకపోయినా, ఆయా భాగాన్ని ప్రధాన మెదడుతో సంబంధం లేకుండా వాటిని నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే వాటిని కూడా మినీ మెదడు కింద లెక్కేసుకోవచ్చు. ఆక్టోపస్ చేతులు ఒక్కొక్కటి వేర్వేరుగా స్పందించగలవు. ఒక చేయి ఆహారం వెతుకుతుంటే, మరో చేయి రాయిని పట్టుకోవచ్చు. ప్రధాన మెదడు ప్రతి చిన్న కదలికను నియంత్రించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆక్టోపస్ వేగంగా పరిస్థితులకు అనుగుణంగా స్పందించగలదు.

చేతుల్లోనే ఎక్కువ నాడీకణాలు

ఆక్టోపస్ శరీరంలోని మొత్తం నాడీకణాల్లో దాదాపు మూడింట రెండొంతులు చేతుల్లోనే ఉంటాయి. అందువల్ల ప్రతి చేయి స్పర్శను గుర్తించడం, వస్తువులను పరిశీలించడం, సమస్యలను పరిష్కరించడం వంటి పనులు చేయగలదు. దీనినే శాస్త్రవేత్తలు డిస్ట్రిబ్యూటెడ్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ వల్ల ఆక్టోపస్ వేటాడటం, శత్రువుల నుంచి తప్పించుకోవడం, సన్నని రంధ్రాల్లోకి చొచ్చుకుపోవడం, మూతలు తెరవడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం వంటి పనులను అద్భుతంగా చేయగలదు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత తెలివైన అకశేరుక (Invertebrate) జీవిగా గుర్తింపు పొందింది.

ఆక్టోపస్

Loading...
Unable to load recommendations.
Follow Us