Custard Apple: సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. 6 ఎకరాల బంజరు భూమిలో 40 లక్షల పంట..

Custard Apple: సంప్రదాయ వ్యవసాయం కంటే చాలామంది రైతులు హార్టికల్చర్ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ రైతు

Custard Apple: సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. 6 ఎకరాల బంజరు భూమిలో 40 లక్షల పంట..
Custard Apple

Updated on: Oct 29, 2021 | 8:31 AM

Custard Apple: సంప్రదాయ వ్యవసాయం కంటే చాలామంది రైతులు హార్టికల్చర్ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ రైతు 6 ఎకరాల బంజరు భూమిలో సీతాఫల్‌ను సాగు చేశాడు. దీంతో 40 లక్షల వరకు సంపాదించాడు. లాభాలు అధికంగా రావడంతో చాలామంది రైతులు సీతాఫల్‌ పంట పండిస్తున్నారు. జన్వాల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ తనకున్న ఆరు ఎకరాల్లో సీతాఫలం సాగు చేశాడు. 2019 నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. అతను ఎకరానికి 2.5 లక్షలు సంపాదించాడు.

2 లక్షల ఖర్చుతో ప్రారంభించిన ఈ పంట నేడు 15 లక్షలకు పైగానే ఆర్జిస్తున్నాడు. ఇప్పటి వరకు 40 లక్షల లాభం పొందారు. ఈ సీతాఫలాలు, బాలకృష్ణ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని రాష్ట్రాల మార్కెట్లలో విక్రయిస్తున్నాడు. సీతాఫల్‌ రకాల్లో ఎంకె 1 గోల్డెన్‌ ప్రత్యేకమైన పండు. ఈ పండు అందంగా కనిపించడమే కాదు తక్కువ నీటిలో రైతులు ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఈ జాతుల పండ్లు చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. ఒక్కోటి 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది.

ఈ రోజుల్లో రైతులు సీతాఫలాన్ని సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఉద్యాన పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరాఠ్వాడాలోని ధరూర్, బాలాఘాట్ గ్రామాలు సీతాఫల్‌కు ప్రసిద్ధి. 1990-91 నుంచి ఉద్యానవన అభివృద్ధి పథకం కింద సీతాఫల్‌ను చేర్చారు. ప్రస్తుతం 25906 హెక్టార్ల విస్తీర్ణంలో విజయవంతంగా మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాలానగర్ లేదా మముత్ జాతులు ఉత్పత్తి, నాణ్యత పరంగా మంచివిగా గుర్తించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ఈ చెట్లను నాటాలి.

ప్రతి మొక్కకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కుళ్ళిన ఎరువు లేదా కంపోస్ట్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అలాగే మొదటి 3 సంవత్సరాలు ప్రతి మొక్కకు ఫలదీకరణం చేయాలి. 5 సంవత్సరాల తరువాత 5 నుంచి 7 చెంచాల ఆవు పేడ లేదా కంపోస్ట్ ఎరువు, 200 నుంచి 500 గ్రాముల యూరియాను అందించాలి. సీతాఫలం సహజంగా ఆకురాల్చే పండ్ల చెట్టు కాబట్టి నీరుగారిపోకుండా పెరుగుతుంది. సీతాఫలం పంటకు క్రమం తప్పకుండా నీరు అవసరం లేదు. స్వచ్ఛమైన వర్షపు నీటిపై కూడా మంచి దిగుబడిని సాధించవచ్చు. కానీ మొదటి 3 నుంచి 4 సంవత్సరాల వరకు చెట్టుకు నీరు పోస్తే మొక్క బలంగా ఎదుగుతుంది.

Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..

Third Wave in India: థర్డ్‌వేవ్ ముంగిట భారత్.. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు..

Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..