Plastic Covers Ban-Chicken: రోజు రోజుకీ ప్లాస్టిక్ వాడకం పెరిపోయింది. ఎంతగా అంటే.. ప్లాస్టిక్ కవర్లను వాడడం తగ్గించండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఎంతగా ప్రభుత్వాలు, సామజిక కార్యకర్తలు చెబుతున్నా.. ప్లాస్టిక్ లేకుండా అడుగు వేయాలని స్టేజ్ కు చేరుకున్నారు. అయితే ఇలా వాడి పారేసిన ప్లాస్టిక్ చెత్త పర్యావరణానికి చేటు చేస్తోంది. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతున్నాయి. ఇక మూగజీవాలు.. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాల్లోని పదార్ధాలను తిని ఎంతగా ఇబ్బందులు పడుతున్నాయో తరచుగా వింటూనే ఉన్నాం.
మన దేశంలో సగటున ప్రతి వ్యక్తి ఒక పాలిథీన్ సంచిని చెత్తబుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్ల పైమాటే అవుతాయి? అవన్నీ భూమిలో, ఎడారిలో, నీళ్ళలో, కొండల్లో, అడవుల్లో, గుట్టల్లో ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. ఆ వ్యర్థం కొండలా పేరుకుపోయి, నెమ్మది నెమ్మదిగా మానవ జాతిని కబళిస్తోంది. ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం దీంతో కొన్ని వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ ను బ్యాన్ చేశాయి. అయితే తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక చిరు వ్యాపారి.. ప్లాస్టిక్ కవర్ నిషేధానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.. వివరాల్లోకి వెళ్తే..
సుధాకర్ చికెన్ మార్కెట్ యజమాని తాను తన షాప్ లో ప్లాస్టిక్ కవర్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించానని .. చికెన్ కొనుగోలు చేసే కస్టమర్ ఇంటి నుంచి చికెన్ తీసుకుని వెళ్ళడానికి ఇంటి నుంచి స్టీల్ డబ్బా తీసుకొని రావాలని సూచించాడు. అంతేకాదు.. అలా స్టీల్ బాక్స్ ను ఇంటి నుంచి తెచ్చిన కస్టమర్ కు కిలో చికెన్ పై రూ. 10 తగ్గించి ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ ప్రకటన బోర్డు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ప్రకటన బోర్డుని షేర్ చేస్తూ.. ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలనీ అందరూ కోరుకుంటారు.. కానీ ఎవరూ ఆ దిశగా అడుగులు వేయరు… కానీ సామాజిక బాధ్యత అంటే ఇలా ఉండాలి.. మంచి ఆలోచన మిత్రమా మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలి అని మనసారా కోరుకుంటున్నాను అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు మరికొందరు మీ ఆలోచనను నేను కూడా ఆచరణలో పెట్టటానికి ప్రయత్నం చేస్తానని అంటున్నారు.
Also Read: Urban Eco Farms: నగరాల్లో రూ. 2400 అద్దెకు 600 గజాల స్థలం.. ఆర్గానిక్ సేద్యంతో 12 రకాల కూరగాయలను పండిస్తున్న వైనం