నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉత్పాదక కార్యకాలాపాలను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలను ప్రోత్సహించేందుకు వీలుగా పీఎల్ఐ పథకాన్ని తీసుకువచ్చింది. దీని కింద టెలికాం పరికరాల తయారీకి పీఎల్ఐ పథకంలో భాగంగా రూ.12.195 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని విడుదల చేసింది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్ళలో రూ.2,44,200 కోట్ల విలువైన టెలికాం పరికరాలు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనివలన దేశంలో 40వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఇది రూ.1.95 లక్షల కోట్ల ఎగుమతికి దారితీస్తుంది. అలాగే రూ.17000 కోట్ల పన్ను ఆదాయాన్ని పొందుతుంది. ఈ పథకంలో అమ్మకాల ప్రమాణాలకు అనుగుణంగా MSMEలకు ఒకటి కంటే ఉత్పత్తి వర్గాలలో పెట్టుబడులు పెట్టడానికి సౌకర్యం ఉంటుంది.టెలికాం రంగంలో పిఎల్‌ఐ పథకం వల్ల దేశంలో సుమారు 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు ఉపాధి కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది.
వాస్తవానికి ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ తయారీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. దీని కింద పిఎల్ఐ పథకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఉత్పాదక రంగంలో ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉన్నందున, పీఎల్ఐ పథకానికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఈ టెలికాం రంగంలో పీఎల్‌ఐ రూ .3 వేల కోట్ల పెట్టుబడిని తెచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో ఉపాధిని పెంచడం ప్రభుత్వం ముందున్న మొదటి పని. ఇందుకోసం మౌలిక సదుపాయాలలో పెద్ద పెట్టుబడిని ఈసారి ప్రకటించింది. ఇక కొన్ని రంగాలకు పీఎల్‌ఐ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనివలన దేశంలో మంచి ఫలితాలు కలగనున్నాయి. ఈ పథకం వలన చైనా సంస్థల వస్తువుల వాడకాలను తగ్గించడమే కాకుండా.. స్వదేశీ తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు సహయపడుతుంది.
Also Read:
JEE Main 2021 ఇంజినీరింగ్ పేపర్ నమునా.. అందులో ఏవిధంగా ప్రశ్నలు ఉంటాయో తెలుసుకోండి..