Tattoos: ఒంటిపై టాటూస్‌ వేయించుకుంటే రక్త దానం చేయరాదా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Oct 25, 2024 | 11:06 AM

నేటి యువత ఫ్యాషన్ పేరుతో రకరకాల టాటూలు వేయించుకుంటున్నారు. కానీ అలాంటి వారిని అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసేందుకు వైద్యులు అనుమతించరు. ఎందుకు తెలుసా..? దానికి కారణలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Tattoos: ఒంటిపై టాటూస్‌ వేయించుకుంటే రక్త దానం చేయరాదా..?  వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Why can't people with tattoos donate blood?
Follow us on

ప్రస్తుత జనరేషన్‌లో టాటూల క్రేజ్ విపరీతంగా పెరిగింది. చేతులు, మెడ, వీపు, ఇలా శరీరంలోని అనేక చోట్ల టాటూలు వేయించుకుంటున్నారు. కొంత మంది తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను తమ శరీరాలపై టాటూలుగా వేయించుకుంటారు. మరికొందరు తమ శరీరాలపై రకరకాల డిజైన్లను టాటూలుగా వేయించుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది యువకులు తమ శరీరాలపై వింత వింత టాటూలు కూడా వేయించుకుంటున్నారు. పురుషులు, మహిళలు అనే తేడా లేదు. అందరూ ఇప్పుడు టాటూలు వేసుకుంటున్నారు. అయితే మీకు తెలుసా.. మీ శరీరంపై ఎక్కడైనా టాటూ ఉంటే కొన్నిసార్లు రక్తదానం చేయడం సమస్యగా మారుతుంది.

చాలా చోట్ల డాక్టర్లు రక్తం దానం చేసేవారి ఒంటిపై పచ్చబొట్టు ఉన్నట్టయితే, వారి రక్తం తీసుకునేందుకు వెనుకడుగు వేస్తుంటారు..ఎందుకంటే టాటూ వేయించుకున్న వారి రక్తం ఎక్కించుకుంటే అంటువ్యాధులు వస్తాయని భావించి వారి దగ్గర రక్తం తీసుకునే వారు కాదు. కానీ, ప్రస్తుతం ఈ విధానం మారిపోయింది.రక్తదానం చేసే ప్రతి 100 మందిలో 90 మందికి టాటూస్ ఉంటున్నాయి. కాబట్టి, దీనిపై రెడ్ క్రాస్ వారు కొన్ని నియమాలను విధించారు. ఎవరైనా టాటూ వేయించుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వారు రక్తదానం చేయటానికి వీల్లేదు. 12 నెలల తరువాత వారు రక్తదానం చేయటానికి అర్హులుగా సూచించారు.

కానీ, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. శరీరంపై టాటూ వేయించుకోవడం వల్ల రక్తదానానికి ఎలాంటి ఆటంకం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఈ టాటూలను ఎల్లప్పుడూ కొత్త సూదులు ఉపయోగించి చేయాలి. కొన్నిసార్లు పచ్చబొట్టు కళాకారులు ఒకే సూదితో అనేక మంది వ్యక్తులకు టాటూలు వేస్తారు. పచ్చబొట్టు వేసుకున్న వారికి ఇది మంచిది కాదు. అలాంటప్పుడు రక్తం ద్వారా మూడు ప్రాణాంతక వ్యాధులు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఇవి కూడా చదవండి

కాబట్టి టాటూ వేయించుకున్న తరువాత కనీసం ఆరు నెలల పాటు ముందు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఆరు నెలల తర్వాత రక్తపరీక్ష చేయించుకుని శరీరంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. అప్పుడు మీరు పచ్చబొట్టు వేయించుకున్నా సురక్షితంగా రక్తాన్ని ఇవ్వవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొంతమంది వైద్యులు ఒక సంవత్సరం పాటు రక్తదానం చేయడాన్ని నిషేధించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..