Budget 2021: ఈఏడాదిలో స్మార్ట్‏ఫోన్స్, కార్లు, టీవీల ధరలు పెరగనున్నయా ? బడ్జెట్ గురించి నిపుణులెమంటున్నారు.. !

|

Jan 22, 2021 | 8:16 PM

2021లో ప్రవేశపెట్టే బడ్జెట్‏లో దిగుమతి పన్ను శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దిగుమతి పన్ను శాతం 5 నుంచి 10

Budget 2021: ఈఏడాదిలో స్మార్ట్‏ఫోన్స్, కార్లు, టీవీల ధరలు పెరగనున్నయా ? బడ్జెట్ గురించి నిపుణులెమంటున్నారు.. !
Follow us on

2021లో ప్రవేశపెట్టే బడ్జెట్‏లో దిగుమతి పన్ను శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దిగుమతి పన్ను శాతం 5 నుంచి 10 శాతానికి పెంచనున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులపై పన్ను పెరగనుందని.. దీంతో వీటి ధరలు అమాంతం పెరగనున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన స్వయం సమృద్ధి భారత్ పథకంలో భాగంగా వీటిపై దిగుమతి పన్ను శాతాన్ని పెంచనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో దేశంలోని తయారీ సంస్థలను ప్రోత్సహించడమే కాకుండా వారికి మద్దతు ఇవ్వడం.. అలాగే ఈ స్వయం సమృద్ది పథకంలో భాగంగా.. రూ.20,000 కోట్ల నుంచి రూ.21,000 కోట్ల వరకు అంటే (2.7 బిలియన్ డాలర్ల నుంచి 2.8 బిలియన్ డాలర్ల ) వరకు ఆదాయాన్ని రాబట్టేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

దిగుమతి పన్ను పెంపుతో ప్రజలపై భారం పడనుందా ?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే దిగుమతి పన్ను శాతం పెంపుతో ఫర్నిచర్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలపై భారం పడనుంది. స్వీడిష్ ఫర్నిచర్ తయారీ సంస్థలైన ఐకియా, టెస్లా వంటి వాటిని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక ఇటీవల టెస్లా కారును కూడా భారత్‏లో లాంచ్ చేయాలని ఆ సంస్థ భావిస్తోంది. కాగా ఇప్పటివరకు అధికారుల నుంచి ఫర్నిచర్, ఎలక్ట్రిక్ వాహనాలపై ఎంతవరకు దిగుమతి పన్ను శాతాన్ని పెంచుతారనే దానిపై కచ్చితమైన సమాచారం రాలేదు. ప్రభుత్వం బడ్జెట్‏లో దిగుమతి పన్ను శాతాన్ని పెంచబోతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఐకియా మరియు టెస్లా సంస్థలు కొంతవరకు డైలామాలో పడ్డాయని చెప్పవచ్చు. అటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్ ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇక ప్రభుత్వం దిగుమతి పన్ను శాతాన్ని పెంచే అవకాశం ఉందా ? లేదా ? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.

మేడ్ ఇన్ ఇండియా దిశలో భారత్..
నిపుణుల అంచనాల ప్రకారం.. ఇటీవల కాలంలో భారత్ విదేశీ సంస్థల ఉత్పత్తుల విక్రయాలను నిలువరించేందుకు దృష్టి సారింది. ఇదే సమయంలో దేశంలోని స్వయం తయారీ పరిశ్రమలు, దేశీయ వ్యాపారాల తోడ్పాటుకు మరియు వాటిని ప్రోత్సహించడానికి అవసరమైన విధంగా సహకరిస్తామని కేంద్రం హామీ ఇస్తుంది. ఇక గతేడాది బూట్లు, ఫర్నిచర్, బొమ్మలు, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులపై కేంద్రం దిగుమతి పన్ను 20 శాతం వరకు పెంచింది.

Also Read:

Budget 2021 : ఆ కార్ల తయారీ సంస్థలకు పన్ను మినహాయింపులు ఉంటాయా ? బడ్జెట్‏లో ప్రవేశపెట్టే అంశాలెంటీ!