Gas cylinder: బంపర్ ఆఫర్.. రూ.9 కే గ్యాస్ సిలిండర్.. ఎలా సొంతం చేసుకోవాలంటే..?

|

May 23, 2021 | 6:17 AM

LPG Cylinder only in 9 Rupees: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందా..? అయితే మీకు ఓ శుభవార్తే.. ఎందుకంటే.. ఇప్పుడు మీరు గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే అతి తక్కువ ధరలోనే గ్యాస్‌ సిలిండర్‌ను

Gas cylinder: బంపర్ ఆఫర్.. రూ.9 కే గ్యాస్ సిలిండర్.. ఎలా సొంతం చేసుకోవాలంటే..?
Lpg Gas
Follow us on

LPG Cylinder only in 9 Rupees: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందా..? అయితే మీకు ఓ శుభవార్తే.. ఎందుకంటే.. ఇప్పుడు మీరు గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే అతి తక్కువ ధరలోనే గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ .809 ఉంది. అయితే.. ఈ ఆఫర్‌లో కేవలం రూ.9కే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం లభించనుంది. గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.800 క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశాన్ని పేటీఎం కల్పిస్తోంది. ఈ పేటీఎం ఆఫర్‌తో 800 ఆదా అవుతాయి. ఈ వాలెట్‌ సంస్థ పేటీఎంతోపాటు ఇండెన్ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. తన ప్లాట్‌ఫాం ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే రూ. 10 నుంచి 800 వరకు క్యాష్‌బ్యాక్‌ అవకాశం లభిస్తుందని పేటీఎం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించాయి. అయితే.. ఇంతటి విలువైన గ్యాస్ సిలెండర్ పై భారీ డిస్కౌంట్‌ను ఎలా పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు కూడా పేటీఎం ఆఫర్‌ను వినియోగించుకోవాలంటే.. మీరు తొలిసారిగా పేటీఎం నుంచి ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకునే వారై ఉండాలి. అలాంటి వారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. పాత కస్టమర్ అయితే.. ఈ ఆఫర్ లభించదు. మీరు పేటీఎం నుంచి సిలిండర్ కోసం బుక్ చేసి చెల్లించినప్పుడు, మీకు ఆఫర్ కింద స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. దీనిద్వారా రూ. 10 నుంచి రూ.800 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ కొత్త కస్టమర్‌కే లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ కోసం, మీరు బిల్ చెల్లింపు తర్వాత మీకు లభించే స్క్రాచ్ కార్డును స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్డును 7 రోజుల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకోలేరు.

Also Read:

బిగ్‌ బజార్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.1500 షాపింగ్‌ చేస్తే రూ.1000 క్యాష్‌ బ్యాక్‌.. వివరాలు ఇవే

Zomato: జోమాటో సంస్థ కీలక నిర్ణయం.. 1.5 లక్షల మందికి ఉచితంగా కరోనా టీకా: సీఈవో దీపిందర్‌ గోయల్‌