అహోం రాజవంశానికి చెందిన నిజం వెలుగులోకి.. థాయ్‌లాండ్ నుంచి వలస వచ్చి 600 ఏళ్ల పాలన

|

Mar 30, 2024 | 11:09 AM

కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని జంతుశాస్త్ర విభాగంలో నిర్వహించిన DNA అధ్యయనంలో అహోమ్ , థాయ్‌లాండ్ మధ్య సంబంధానికి ఆధారాలు లభించాయి. మంగళూరు యూనివర్శిటీ, డెక్కన్ కాలేజ్, పూణే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఏడుగురు పరిశోధకులు  ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ పరిశోధన హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ అనే ప్రతిష్టాత్మక జర్నల్‌లో ప్రచురించబడింది.

అహోం రాజవంశానికి చెందిన నిజం వెలుగులోకి.. థాయ్‌లాండ్ నుంచి వలస వచ్చి 600 ఏళ్ల పాలన
Ahoms Of Thailand Genetically Closer To Khasi
Image Credit source: Credit- kaziranganationalparkassam
Follow us on

ఈశాన్య  భారత దేశంలోని అస్సాం గురించి మాట్లాడినప్పుడల్లా అహోం రాజవంశం గురించి ప్రస్తావన ఉంటుంది. అహోమ్‌లు థాయ్ తెగ వారసులు. వీరు స్థానిక నాగాలను ఓడించి 6 శతాబ్దాల పాటు ప్రస్తుత అస్సాంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. అంతేకాదు భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఈ వ్యక్తులు అసలు భారతీయులు కాదని మీకు తెలుసా. ఇటీవలి అధ్యయనం ప్రకారం  అహోమ్ రాజవంశ స్థాపకుడు థాయిలాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు. కాశీ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) సహా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని జంతుశాస్త్ర విభాగంలో నిర్వహించిన DNA అధ్యయనంలో అహోమ్ , థాయ్‌లాండ్ మధ్య సంబంధానికి ఆధారాలు లభించాయి. మంగళూరు యూనివర్శిటీ, డెక్కన్ కాలేజ్, పూణే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఏడుగురు పరిశోధకులు  ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ పరిశోధన హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ అనే ప్రతిష్టాత్మక జర్నల్‌లో ప్రచురించబడింది.

మొదటి సారి చేసిన అధ్యయనంలో వెలుగులోకి జన్యు సంబంధం

దేశవ్యాప్తంగా అహోంల గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా అహోంలపై అనేక పరిశోధనలు జరిగాయి. అహోం ప్రజలు చారిత్రాత్మకంగా 12వ శతాబ్దంలో అస్సాంకు వలస వచ్చారు. ఈ వాదన కొత్త అధ్యయనంలో శాస్త్రీయంగా పరీక్షించబడింది. అస్సాంతో సహా భారతదేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలలో నివసిస్తున్న ఆధునిక అహోం జనాభా 6,12,240 ఆటోసోమల్ గుర్తులను పరిశీలించారు. సాధారణ భాషలో చెప్పాలంటే వీరికి DNA పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో వీరికి  థాయిలాండ్‌తో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

థాయ్‌లాండ్‌ నుంచి వలస వచ్చిన తర్వాత అహోం వంశీయులు ఈ ప్రాంతంలో నివసించే హిమాలయ జనాభాతో జన్యుపరంగా కలిసిపోయారని స్పష్టమవుతోందని పరిశోధనలో పాల్గొన్న రచయిత డాక్టర్ సచిన్ కుమార్ తెలిపారు. లక్నోలోని పురాతన DNA లేబొరేటరీ అధిపతి డాక్టర్ నీరజ్ రాయ్ మాట్లాడుతూ.. హై-రిజల్యూషన్ హాప్లోటైప్ ఆధారిత విశ్లేషణలో అహోమ్ జనాభా ప్రధానంగా నేపాల్‌లోని కుసుంద జనాభాతో,  మేఘాలయలోని ఖాసీ జనాభాతో జన్యుపరమైన సంబంధం కలిగి ఉన్నట్లు తమ పరిశోధనలో వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.

Assam Ahom Dynasty credit Kaziranganationalparkassam

కాలానుగుణంగా భారతీయీకరణ

భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం తూర్పు ఆసియా ఆధునిక నాగరికతకు ద్వారం. థాయ్ జనాభా కూడా ఇక్కడి నుంచే భారతదేశానికి వచ్చారు. కొంతకాలం తర్వాత వారు తమ పూర్వీకుల భూమితో సంబంధాలు కోల్పోయారు. అహోమ్‌లు థాయిలాండ్‌కు చెందినవారు కనుక వారి మతం, భాష , ఆచారాలు స్థానిక ప్రజల కంటే భిన్నంగా ఉన్నాయి. BHU జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే మాట్లాడుతూ కాలక్రమేణా ఈ తెగ హిమాలయ ప్రజలతో కలిసిపోయి భారతీయులుగా మారిపోయారు.

నిర్మల్ కుమార్ బసు రాసిన ‘అస్సామ్ ఇన్ అహోమ్ ఏజ్’ పుస్తకం ప్రకారం గొప్ప థాయ్ రాజవంశంలోని షాన్ శాఖకు చెందిన అహోం యోధులు సుఖ్పా నాయకత్వంలో స్థానిక నాగులను ఓడించి ప్రస్తుత అస్సాంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కోణంలో అహోం రాజవంశం కూడా ముఖ్యమైనది. మొఘలులు ఎన్నటికీ జయించలేని కొన్ని రాజవంశాల్లో ఈ వంశం ఒకటి.

అస్సాంలోని దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగానికి చెందిన దీపాంకర్ మోహన్ అహోం ప్రజలను అధ్యయనం చేశారు. అతని నివేదిక ప్రకారం  అహోమ్‌లు తమ సొంత మతపరమైన ఆచారాలను కలిగి ఉన్నారు. అయితే తమ మతాన్ని ఆచరించాలంటూ ఇతర తెగలపై ఎప్పుడూ షరతులు విధించలేదు. పైగా  స్థానిక ప్రజల సంస్కృతిలో ఒకరుగా కలిసిపోయారు. మొదట్లో అహోం ప్రజలు థాయ్ భాష మాట్లాడేవారు. అయితే తర్వాత థాయ్ బాష స్థానంలో అస్సాం భాష వాడుకలోకి వచ్చింది. ఇందులో కొన్ని అహోమ్-థాయ్ పదాలు కూడా ఉన్నాయి. అదే విధంగా హిందూ మతాన్ని స్వీకరించడానికి ముందు అహోం ప్రజలు తమ కుటుంబీకులు చనిపోయినవారిని సమాధి చేసేవారు. అయితే హిందూ మతం ప్రభావంతో దహన సంస్కారాలు అహోంలలో ప్రాచుర్యం పొందాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..