చాలా ఇళ్లలో రాత్రి పూట లైట్ల వద్ద బల్లలు సంచరిస్తూ ఉంటాయి. పురుగుల కోసం అవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. వీటి కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బల్లులను చూసి చాలామంది పిల్లలు భయపడతారు. ఇంటి నిండా బల్లలు సంచరిస్తూ ఉంటుంటే.. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలియకుండా ఆహారంలో అవి పడ్డాయి అనుకోండి ఫుడ్ పాయిజన్(Food poisoning) అవుతుంది. సీరియస్ అయితే ప్రాణాలు కూడా పోతాయి. అందుకే వీటిని తరిమికొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైనది.. నెమలి ఈకలు అవి తిరిగే ప్రదేశంలో పెట్టడం. ఇలా చేస్తే బల్లులు(Lizards) పారిపోతాయని అంటూ ఉంటారు. అది ఎంతవరకూ నిజమో ఇప్పుడు తెలుసుకుందాం…
నెమలి ఈక పైభాగంలో పెద్ద కన్నులాంటి ఆకారం ఉంటుంది. బల్లి దానిని చూసి.. అదేదో పెద్ద జంతువు కన్నుగా భావించి భయపడుతుందని కొందరు అంటుంటారు. నెమళ్ళు బయట ప్రదేశాల్లో ఉన్నప్పుడు బల్లులను వేటాడి తింటాయని.. అందుకే బల్లులు నెమళ్లను చూడగానే ఆమడదూరం పోతాయనేది మరికొందరి వెర్షన్. నెమలి ఈకల నుంచి వచ్చే వాసన కారణంగా బల్లులు దాని నుంచి దూరంగా ఉంటాయని మరికొందరి నమ్మకం. అయితే ఈ కారణాలు నిజమని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కొందమంది నిపుణులు అయితే ఈ వాదనలను పూర్తిగా ఖండించారు. బల్లి నెమలి ఈకల వద్ద తారసలాడిన వీడియోలను వారు ఆధారాలుగా కూడా చూపుతున్నారు.
Also Read: Health Tips: మండే ఎండలు.. మీకు తరచూ వేడి చేస్తుందా.. ఇదిగో టిప్స్