
పాముతో పోరాడే జంతువు అంటే చాలా మందికి ముంగిసే గుర్తుకొస్తుంది. ముంగిస పాముతో భయపడకుండా పోరాడుతుంది. ఇది మెరుపు వేగంతో కదలడం వల్ల పాము దాన్ని కాటేయడానికి అవకాశం దొరకదు. పైగా ఒకవేళ పాము కాటేసినా, ముంగిస శరీరంలోని ప్రత్యేక నిరోధకశక్తి వల్ల అది ప్రమాదకరం కాకపోవచ్చు. జన్యుపరంగా దీని శరీరం పాము విషాన్ని తట్టుకునేలా ఉంటుంది. కానీ చాలా సార్లు కాటు తగిలితే మాత్రం ప్రాణాపాయం తప్పదు.

హనీ బ్యాడ్జర్ ఒకటి కాదు రెండు కాదు ఏ విష పాము కాటైనా తట్టుకునే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. దీని శరీరంపై గట్టిగా ఉండే రోమాలు, దట్టమైన చర్మం వల్ల పాము విషం లోపలికి వెళ్లే అవకాశమే ఉండదు. ఒకవేళ విషం శరీరంలోకి ప్రవేశించినా ఇది కొంతసేపటికి తేరుకుని తిరిగి సాధారణంగా మారిపోతుంది. ఈ జంతువు పాములను చంపి తినడంలో కూడా దిట్ట.

చెక్క ఎలుక కూడా పాము కాటుకు గురైనా అంత తేలిగ్గా ప్రాణాలు కోల్పోదు. దీని శరీర నిర్మాణంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాల వల్ల పాము విషం ప్రభావం చూపించదు. అయితే పాములు కూడా దీన్ని వేటాడి తినేస్తాయి. అందుకే ఇవి పాముల సమీపంలో ఉండకుండా జాగ్రత్త పడతాయి.

పంది శరీరంలో ఉండే ప్రత్యేకమైన న్యూరోటాక్సిన్ వల్ల పాము కాటు వేసినా విషం పనిచేయదు. ఈ కారణంగా పందులపై పాముల ప్రభావం ఉండదు.

ఐరోపాలో కనిపించే ముళ్ల పంది పాము కాటుకు గురైనా ప్రాణాపాయం ఉండదు. దీని శరీరంపై గట్టిగా ఉండే ముళ్లవల్ల, పాము విషం లోపలికి చొచ్చుకుపోయే అవకాశమే ఉండదు. ఈ జంతువు చిన్నదిగా కనిపించినా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పాములను చూసినప్పటికీ భయపడదు.