
మీరు తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ వంటి స్మారక చిహ్నాలను సందర్శించాలనుకుంటున్నారా..? అది కూడా ఫ్రీ ఎంట్రీతో చూడాలనుకుంటే మీరు వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి.. ఎందుకంటే.. యోగా డే సందర్భంగా తాజ్ మహల్‌కు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఇది కేవలం స్థానిక పర్యాటకులకే కాదు.. భారతీయులు, విదేశీయులందరికీ నిర్దేశించిన చారిత్రక ప్రదేశాల్లో రోజంతా టికెట్టు లేకుండా లోనికి ప్రవేశించేందుకు అనుమతి కల్పిస్తున్నారు. యోగా దినోత్సవం నాడు స్మారక చిహ్నాలకు ఉచిత ప్రవేశం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
యోగా దినోత్సవం నాడు తాజ్ మహల్ తో సహా అన్ని స్మారక చిహ్నాలను సందర్శించడం ఉచితం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా దినోత్సవం నాడు తాజ్ మహల్ తో సహా అన్ని స్మారక చిహ్నాలలోకి ప్రవేశం ఉచితం అని భారత పురావస్తు సర్వే సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు భారత పురావస్తు సర్వే సంస్థ స్మారక చిహ్నాలలో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో తాజ్ మహల్‌తో సహా అన్ని స్మారక చిహ్నాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే తాజ్ ప్రధాన గోపురం సందర్శించడానికి రూ. 200 అదనపు టికెట్ వర్తిస్తుంది.
తాజ్ మహల్ సందర్శన కోసం వచ్చే ప్రజలకు సాధారణ టికెట్ ధర రూ. 50లు. ఇది మూడు గంటలు చెల్లుతుంది. ఉర్సు సమయంలో పర్యాటకులు షాజహాన్, అతని భార్య ముంతాజ్ నిజమైన సమాధులను చూడటానికి నేలమాళిగలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..