Aadhaar Card Update: మన దేశంలో అన్నిటికి ఆధార్ కార్డు ఆధారం.. అయితే ఈ ఆధార్ కార్డులోని ఫోటో చాలామందికి అసంతృప్తిని ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమాలనుంచి సామాన్యుల వరకూ ఈ ఆధార్ లోని ఫోటోల పై జోక్స్ వస్తూనే ఉంటారు. అంటే ఆధార్ లోని ఫోటో సరిగ్గా లేదన్న మాట. అయితే ఆధార్ కార్డు లోని పేరు , అడ్రస్, పుట్టిన తేదీ ని మార్చుకున్నట్లు ఫోటో కూడా చేంజ్ చేసుకునే వీలుంది. ఇదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) సమీప ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్ కార్డులోని ఫోటోను మార్చుకునే వీలుని కల్పించింది. అయితే మీ ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడానికి చేయాల్సిన ప్రాసెస్ గురించి తెలుసుకుందాం..
అయితే ఇలా ఫోటో మార్పు చేసుకోవడం కోసం ఫీజు రూ. 25 లతో పాటు జీఎస్టీ ని చెల్లించాల్సి ఉంది. తర్వాత ఆధార్ సెంటర్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఫోటోను మారుస్తారు. ఆధార్ ఎగ్జిక్యూటివ్ కూడా ఆధార్ కార్డ్ హోల్డర్కు నవీకరణ అభ్యర్థన సంఖ్య (యుఆర్ఎన్) తో ఉన్న రసీదుని ఇస్తుంది.
*ముందుగా UIDAI వెబ్‌సైట్ – uidai.gov.in లో లాగిన్ అవ్వండి .. అక్కడ నుంచి ఆధార్ నమోదు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అది పూర్తి చేయండి.
*ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్ నింపి సమీపంలోని స్థానిక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో పనిచేస్తున్న ఆధార్ ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించండి.
*అక్కడ ఆధార్ ఎగ్జిక్యూటివ్ మీ బయో మెట్రిక్ వివరాలు తీసుకుంటారు.
*తర్వాత ఆధార్ నమోదు కేంద్రంలో ఎగ్జిక్యూటివ్ మీ ఫోటో తీస్తారు,
*ఎగ్జిక్యూటివ్ మీ ఆధార్ కార్డ్ ఫోటోను రూ .25 తో పాటు జీఎస్టీ వసూలు చేస్తుంది.
*ఎగ్జిక్యూటివ్ మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (యుఆర్ఎన్) తో రసీదు స్లిప్ ఇస్తుంది.
*ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ ఫోటో మార్చబడిందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి మళ్ళీ మీ URN ని ఉపయోగించండి.
*ఆధార్ కార్డ్ ఫోటో అప్‌డేట్ తరువాత, కొత్త ఫోటో ఉన్న ఆధార్ కార్డును UIDAI వెబ్‌సైట్ – uidai.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*ఈ విధంగా ఆధార్ లోని ఫోటో మీకు నచ్చని యెడల. దాని ప్లేస్ లో కొత్త ఫోటోను సులభంగా యాడ్ చేసుకోవచ్చు.
Also Read: హోమ్ క్వారంటైన్‌లో కరోనా పేషేంట్స్ ఉన్నారా.. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి
ఈరోజు ఏ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి.. రాశివారికి ఉద్యోగ ఫలితాలు ఇస్తాయంటే