Telangana: ఆదుకోండి.. లేదా డెత్ ఇంజక్షన్ ఇవ్వండి.. బతికి ఉండగానే చావు కోరుకుంటున్న యువకుడు..!

| Edited By: Balaraju Goud

Jul 12, 2024 | 5:09 PM

మరణాన్ని కావాలని ఎవరు ఆహ్వానించరు..! ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరణాన్ని ఎదుర్కొంటారు. కానీ ఓ యువకుడు మాత్రం మెర్సీ కిల్లింగ్ కోసం ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం చేయూతనిచ్చి నన్ను ఆదుకోవాలి.. లేదా డెత్ ఇంజక్షన్ కు ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాడు. ఆ యువకుడికి వచ్చిన కష్టం ఏంటి?

Telangana: ఆదుకోండి.. లేదా డెత్ ఇంజక్షన్ ఇవ్వండి.. బతికి ఉండగానే చావు కోరుకుంటున్న యువకుడు..!
Rare Disease
Follow us on

మరణాన్ని కావాలని ఎవరు ఆహ్వానించరు..! ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరణాన్ని ఎదుర్కొంటారు. కానీ ఓ యువకుడు మాత్రం మెర్సీ కిల్లింగ్ కోసం ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం చేయూతనిచ్చి నన్ను ఆదుకోవాలి.. లేదా డెత్ ఇంజక్షన్ కు ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాడు. ఆ యువకుడికి వచ్చిన కష్టం ఏంటి? ఆ యువకుడు ఎదుర్కొంటున్న నరకం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

చూడడానికి బాగానే కనిపిస్తారు. మంచంపై నుంచి కాలు కింద మోపలేరు. చేతులు పైకెత్తలేరు. దేనినీ పట్టుకోలేరు. వారి పనులు వారు చేసుకోలేరు. ఏ తోడు లేకుండా ఇంచు కూడా కదల్లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే. యుక్త వయసున్న పసి పిల్లలు వారు. కండరాల క్షీణత వ్యాధి అంటే శరీరంలో ప్రతి కండరం క్షీణించిపోతుంది. కండరాలు క్షీణించి కాలు కదపడం, చేతులు లేపడం లాంటి కదలికలు కనుమరుగు అవుతుంది. అరుదైన జన్యు సంబంధిత వ్యాధుల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో ఎప్పుడైనా వచ్చే అవకాశముంది. ఇటువంటి వ్యాధి నల్లగొండ చెందిన యువకుడికి వచ్చింది.

నల్లగొండకు చెందిన 44 ఏళ్ల గోపాల్ 25 ఏళ్లుగా మస్క్యులర్ డ్రిస్టోపీ (కండరాల క్షీణత) వ్యాధితో బాధపడుతున్నారు. గోపాల్ ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి 2000లో ఆర్టీసీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం రావడంతో ఫిజికల్ టెస్టులో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ కు పంపించారు. అక్కడ పరీక్షించగా గోపాల్ కు మస్క్యులర్ డ్రిస్టోపీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయన ఆర్టీసీలో ఉద్యోగం కోల్పోయా.డు తరువాత ఆరు నెలల కాలంలోనే వ్యాధి తీవ్రమై కండరాలు క్షీణించి జీవచ్చవంలా మారాడు. కదలలేక నడవలేక, కాళ్లు, చేతులు పనిచేయక మాటకే పరిమితమయ్యారు.

అతనికి అన్నీ తానైన కన్నతల్లి.. జీవచ్ఛవంలా మారి నడి వయసుకు వచ్చిన కుమారుడికి 75 ఏళ్ల వృద్ధురాలైన తల్లి అంజమ్మ ఒక్కతే దిక్కు. తల్లికి కుమారుడు చేదోడు వాదోడుగా ఉండాల్సిన వయసులో తల్లే తన కుమారుడికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. బిడ్డ అనుభవిస్తున్న నరకం చూడలేక తాను చనిపోతే బాగుండునని ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. చేతికి ఎదిగిన నడి వయసు కొడుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మంచానికి పరిమితం కావడంతో ఆ తల్లి వేదన వర్ణనాతీతం. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, కేవలం ఇద్దరి పెన్షన్ తో బతుకుతున్నామని చెబుతున్నారు. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకుకు తాను సపర్యాలు చేయలేకపోతున్నానని వాపోతున్నారు. ఈ కష్టాలను తాళలేక తాను తన కొడుకు ఏదైనా మందు తాగిచనిపోవాలనిపిస్తోందని తల్లి అంజమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డెత్ ఇంజక్షన్ ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించండి..

25 ఏళ్లుగా తాను అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని గోపాల్ వేడుకుంటున్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ 4 వేల రూపాయలే తమకు ఆధారమని, తమకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని, లేదంటే తనకు డెత్ ఇంజక్షన్ ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు. మెర్సీ కిల్లింగ్ కోసం కలెక్టర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు దరఖాస్తు చేస్తానని, దీనిపై తన అడ్వకేట్ పనిచేస్తున్నారని గోపాల్ చెబుతున్నారు. తాను మరణిస్తే తన భౌతికకాయాన్ని మస్క్యులర్ డిస్టోపీ వ్యాధి నయం చేసే మందును కనుగొనేందుకు పరిశోధనకు ఉపయోగించాలని కోరుతున్నారు. దాతలు ముందుకొచ్చి ఫోన్ నంబర్ 9182241141 (గూగుల్ప, ఫోన్ పే )కు ఆర్థిక సాయం చేయాలని ధేయపడుతున్నారు.

కేర్‌ టేకర్‌ను నియమించాలి..!

కండరాల క్షీణత వ్యాధితో రాష్ట్రవ్యాప్తంగా 6,000 మంది బాధితులు ఉన్నారు. కండరాల క్షీణతతో మంచం పడుతున్న వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేర్‌ టేకర్‌ను నియమించాలని గోపాల్ విజ్ఞప్తి చేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తన ఇంట్లో తల్లి సేవలందిస్తున్నారు. కానీ, కొంతమంది వ్యాధిగ్రస్తుల ఇళ్లలో సేవ చేసే వారు లేనందున కేర్‌ టేకర్‌ను గాని, కేర్‌ టేకర్‌ అలవెన్స్‌ గాని మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో అత్యధికులు అవివాహితులు. ఒంటరి వారుగా గుర్తించి రేషన్‌ కార్డును అందజేస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలకు అర్హులయ్యే అవకాశముందన్నాడు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చి నీడ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

ఏపీలో మాదిరిగా పెన్షన్ ను 15 వేలకు పెంచాలి..

రాష్ట్రంలో కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు కూడా 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తోందని గోపాల్ చెబుతున్నాడు. ఏపీలో ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం 15,000 రూపాయల పెన్షన్ ఇస్తోందని, ఇక్కడ కూడా అలానే మంజూరు చేయాలని కోరారు. ఈ వ్యాధిగ్రస్తులకు సపర్యాలు చేయడానికి కుటుంబ సభ్యులు లేని వారికి ప్రభుత్వం కేర్ టేకర్ ను నియమించాలని గోపాల్ కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…