అడవిలో రబ్బర్ ఏరేందుకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. కట్ చేస్తే..

బ్రతుకుతెరువు కోసం అడవిలో రబ్బరు ఏరేందుకు వెళ్లింది 'జరా' అనే ఓ 54 ఏళ్ల మహిళ. అయితే ఆమె మళ్లీ తిరిగి రాలేదు.

అడవిలో రబ్బర్ ఏరేందుకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. కట్ చేస్తే..
Python

Updated on: Oct 26, 2022 | 12:25 PM

ఓ మహిళను భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రతుకుతెరువు కోసం అడవిలో రబ్బరు ఏరేందుకు వెళ్లింది ‘జరా’ అనే ఓ 54 ఏళ్ల మహిళ. అయితే ఆమె మళ్లీ తిరిగి రాలేదు. అడవికి వెళ్లి రెండురోజులైనా ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త అడవిలోకి వెళ్లి వెతికాడు. అడవిలో అతనికి ఓచోట జరా చెప్పులు, జాకెట్‌, హెడ్‌స్కార్ఫ్‌, కత్తి కనిపించాయి. వెంటనే అతను అధికారులకు సమాచారమిచ్చాడు.

జరా భర్త సమాచారంతో సిబ్బందిని వెంటపెట్టుకుని అడవికి చేరుకున్న అధికారులు ఆ ప్రాంతానికి కొంత దూరంలో భారీ కొండచిలువను గమనించారు. దాని కడుపు బాగా ఉబ్బెత్తుగా కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అదృశ్యమైన జరాను అది మింగేసి ఉంటుందని భావించి దానిని బంధించారు.

ఈ క్రమంలో గ్రామస్థులందరూ కలిసి కొండ చిలువ పొట్టను చీల్చారు. సగం జీర్ణమైన స్థితిలో మహిళ కళేబరం కొండచిలువ కడుపులో కనిపించింది. వెంటనే దానిని బయటకు తీశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జరాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమెను మింగడానికి ముందు చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, ఇంతకుముందు ఈ ప్రాంతంలో 27 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించిందని స్థానికులు తెలిపారు.