Yogurt: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఇలా చేయండి.. భారీ ఉపశమనం పొందండి..

|

Apr 05, 2021 | 11:31 PM

Yogurt: ఒక వయసు వచ్చాక చాలా మంది ఎక్కువగా బాధపడేది కీళ్ల నొప్పులతోనే. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే...

Yogurt: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఇలా చేయండి.. భారీ ఉపశమనం పొందండి..
Knee Pains
Follow us on

Yogurt: ఒక వయసు వచ్చాక చాలా మంది ఎక్కువగా బాధపడేది కీళ్ల నొప్పులతోనే. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కీళ్ల నొప్పుల బాధ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మారిన జీవనశైలితో, ప్రస్తుత ఉరుకులు, పరుగుల ప్రపంచంలో 30 ఏళ్లు దాటిన వారు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే, ఈ కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి బాధితులు పడని పాట్లు ఉండవంటి అతిశయోక్తి కాదు. ఎక్కని ఆస్పత్రి మెట్లు లేవు, తిరగని మెడికల్ షాపు లేదు అన్నట్లుగా బాధితుల పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ కీళ్ల నొప్పులకు మన పురాతన కాలం వస్తున్న వంటింటి చిట్కాలతోనే పుల్‌స్టాప్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. మనం నిత్యం ఆహారంలో తీసుకునే పెరుగుతోనే కీళ్ల నొప్పులకు బైబై చెప్పొచ్చంటున్నారు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు తొలిదశలోనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటి అది కాస్తా ముదిరి అస్థియోపోరోసిస్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు. ఇక ఈ కీళ్ల నొప్పులను మనం రోజూ ఆహారంలో తినే పెరుగు ద్వారా తగ్గించుకోవచ్చంటున్నారు. అదెలాగంటే.. రెండు టీ స్పూన్ల అవిసె గింజలను కొద్దిగా వేయించాలి. ఆ తరువాత దానిని పొడిగా చేసుకుని, ఆ పొడిని కప్పుడు పెరుగులో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ మధ్యాహ్నం సమయంలో తీసుకోవాలి. అలా మూడు రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తాగాలి. ఇది సేవించడం వల్ల కీళ్ల మధ్య గుజ్జు పెరిగే అవకాశం ఉంటుందట. దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఒకసారి ట్రై చేయండి. అయితే, ఇది నిపుణులను అడిగి తెలుసుకుని పాటిస్తే మంచింది. వాస్తవానికి అవిసె గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెకు మేలు చేయడంతో పాటు.. జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. వీటిలో ఫైబర్‌తో పాటు.. ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా చేస్తాయి.

Also read:

IPL 2021: ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది.. ఇప్పటివరకు ఎన్ని జట్టు ఐపీఎల్ ఛాంపియన్ల నిలిచాయో తెలుసా..

Earhquake: భారీ భూకంపం.. సిక్కిం-నేపాల్, అస్సాం, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కంపించిన భూమి..