Night meal tips: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది కడుపు మాడ్చుకుంటుంటారు. తక్కువ తినడమో, అసలు తినకపోవడమో చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రి భోజనం (Night meal) మానేస్తుంటారు. మనలో కూడా చాలామంది ఇలా చేస్తుంటారు. అయితే రాత్రి భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారో లేదో తెలియదు కానీ దీర్ఘకాలం పాటు ఇలా చేయడం తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి తగినంత ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేకపోతే శరీరం సమతాస్థితిని కోల్పోతుంది. జీర్ణసమస్యలు వెంటాడతాయి. మరి రాత్రివేళల్లో ఆహారం తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఒకసారి తెలుసుకుందాం రండి.
శక్తి స్థాయులపై ప్రతికూల ప్రభావం..
రాత్రి వేళల్లో ఎలాంటి శారీరక శ్రమ ఉండదని, శరీరం కూడా శక్తిని ఖర్చు చేయదని చాలామంది ఆహారం మానేస్తుంటారు. పైగా దీని వల్ల ఎలాంటి సమస్యలు రావని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కూడా శరీరం చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. అందువల్ల, నిద్రపోయే ముందు తగినంత ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. లేకపోతే ఈ అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమి..
రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకోవడం, అసలు తీసుకోకపోవడం వల్ల నిద్రలేమి సమస్య కలుగుతుంది. ఖాళీ కడుపుతో బెడ్ ఎక్కడం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టదు. పైగా ఎసిడిటీ, గ్యాస్ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. ఒకవేళ అధిక బరువు ఉండి, వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే రాత్రి పూట తేలికగా భోజనం తీసుకోవచ్చు. అన్నం బదులు చపాతీలు తీసుకోవచ్చు.
పోషకాహార లోపం
శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే పోషకాహారం చాలా అవసరం. రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి సరైన స్థాయిలో పోషకాలు అందవు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి. తలతిరగడం లాంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. రక్తప్రసరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు తప్పకుండా ఆహారం తీసుకోవాలంటారు నిపుణులు.
వీటిని ప్రయత్నించండి..
రాత్రి పూట అన్నం తీసుకోకపోవడం ఇష్టం లేకపోతే నచ్చిన కూరగాయలతో సూప్ చేసుకుని తీసుకోండి. ఇది త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో కెలొరీలు కూడా ఎక్కువగా ఉండవు. సెనగలు, బఠాణీలు, మొలకెత్తిన గింజలు, పండ్లు, కూరగాయ ముక్కలు… ఇలా అన్నింటిని కలిపి సలాడ్‌గా తీసుకోవచ్ఛు వీటన్నింటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్ఛు.
Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..
Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!