మధుమేహం చాలా సాధారణ వ్యాధులలో ఒకటి. షుగర్ ఎంత సాధారణమో.. దానిని నియంత్రించడం కష్టమైన పనేం కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెరను నియంత్రించడం.. శరీరాన్ని శక్తివంతం చేసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలోని ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ లోపం ఉన్నప్పుడు.. అంటే ఇన్సులిన్ తక్కువ మొత్తంలో చేరినప్పుడు.. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిని మధుమేహం అంటారు. ఇన్సులిన్ అనేది మన శరీరంలోని జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఆహారాన్ని శక్తిగా మార్చడమే దీని పని. డయాబెటిక్ పేషెంట్లలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి వారికి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. చక్కెరను నియంత్రించడానికి అనేక పద్ధతులు అవలంబించ్చు. వాటిలో ఒకటి నిమ్మకాయతో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన అనేక అంశాలు నిమ్మకాయలో ఉన్నాయి. మధుమేహ బాధితులకు నిమ్మ పండుతో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. నిమ్మకాయతో మధుమేహాన్ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం.
నిమ్మకాయ లక్షణాలు
నిమ్మకాయలో విటమిన్-ఎ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు వంటి పోషకాలు లభిస్తాయి. నిమ్మకాయలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయ, గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది మధుమేహంలో ప్రయోజనకరం అని చెప్పవచ్చు.
చక్కెర స్థాయిని ఎలా తగ్గించాలి?
గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి ఎక్కువైతే చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. నిమ్మకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.
నిమ్మకాయ ఎలా తినాలి
భోజనానికి గంట ముందు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే బరువు అదుపులో ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే మధుమేహం పెరగదు. మీరు సలాడ్‌లో కూడా నిమ్మకాయ రసం పిండుకుని తినవచ్చు. ఆహారంతోపాటు తీసుకోవచ్చు. ఆహారంతోపాటు నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం