World Liver Day 2021: మన శరీరంలో ముఖ్యమైన అవయవం కాలేయం.. దీనిని శుభ్రం చేసి.. ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాలు ఏమిటంటే..!

|

Apr 19, 2021 | 12:11 PM

World Liver Day 2021: శరీరంలోని రెండవ అతిపెద్ద అవయవం కాలేయం. ఇది మనిషి అవయవాల్లో ఎంతో ముఖ్యమైనది. కాలేయానికి డ్యామేజ్ జరిగితే అనేక రకాలైన అనారోగ్య సమస్యల తలెత్తుతాయి...

World Liver Day 2021: మన శరీరంలో ముఖ్యమైన అవయవం కాలేయం.. దీనిని శుభ్రం చేసి.. ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాలు ఏమిటంటే..!
Liver Day
Follow us on

World Liver Day 2021: శరీరంలోని రెండవ అతిపెద్ద అవయవం కాలేయం. ఇది మనిషి అవయవాల్లో ఎంతో ముఖ్యమైనది. కాలేయానికి డ్యామేజ్ జరిగితే అనేక రకాలైన అనారోగ్య సమస్యల తలెత్తుతాయి. కాలేయం గురించి అవగాహన పెంచడానికి ఏప్రిల్ 19 న ప్రపంచ కాలేయ దినోత్సవంగా జరుపుకుంటుంన్నాం.. నేడు కాలేయ దినోత్సవం సందర్భంగా.. కాలేయం పనితీరును.. ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాన్ని తెలుసుకుందాం..

కాలేయం మన శరీర జీవక్రియల్లో అత్యంత ముఖ్య పోషిస్తుంది. కాలేయం జబ్బు పడినా కూడా తనను తాను బాగు చేసుకోగలదు, శరీరానికి కావల్సిన శక్తిని తయారు చేయగలదు. పావువంతు అవయవం బావున్నా సరే తనని తాను తిరిగి నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవమే కాలేయం. ఇది మన శరీరంలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం.. జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి అనేక కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది కాలేయం. కనుక దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం అతి ముఖ్యం..

కాలేయం పనితీరును సామర్ధ్యాన్ని పెంపొందించడానికి తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉపయోగపడతాయి. వీటిల్లో బి కాంప్లెక్స్ అధికం. అందుకని ఇవి కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది.

అన్ని నూనెల కంటే కాస్టిలీ ఆయిల్ ఆలివ్ ఆయిల్. దీనిలో కూడా కాలేయ పనితీరుపై ప్రభావం చూపే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వెల్లుల్లి లో కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని రోజువారీ ఆహారంలో ఇవి తప్పని సరి.

ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు తక్కువగాను ఉండే యాపిల్స్ కూడా పేగులు, కాలేయం, మేదావు వంటి అంతర్గత అవయవాల పనితీరు పై ప్రభావం చూపిస్తుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు అని అంటారు.

క్యాలీఫ్లవర్ లా కనిపించే బ్రకోలీ లో కూడా విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. దీనిని ఉడికించి లేదా పచ్చిగా తిన్నా కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది.

బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటి దుంపకూరలు కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి. ముఖ్యంగా కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

కాలేయంలో వ్యర్ధాలను బయటకు నెట్టివేయడానికి ధనియాలు మంచి సహాయకారి. వీటిని ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని త్రాగాలి.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్న పసుపు కాలేయానికి చాలా ఆరోగ్యకరం. దీన్ని ప్రతి రోజూ మనం రోజూ చేసుకునే వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి.

నిమ్మలో ఉండే విటమిన్ సి కాలేయాన్ని శుభ్రం చేయడానికి ఉపయోకాపాడుతుంది. ఇది గ్లూటాథియోన్ ను ఉత్పత్తి చేస్తుంది. కనుక రోజూ ఒక గ్లాసు నీటిలో నిమ్మరసంను కలిపి ఉదయం కాలీ కడుపుతో త్రాగాలి.

Also Read: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!

మహిళల్లో పీసీ ఓడీ, సిస్టులు, నీటి బుడగలు వంటి సమస్యలు వేధిస్తున్నాయా.. నివారణకోసం ఈ ఆసనాన్ని ట్రై చేయండి