ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా..చాలా మంది రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కోంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి భారీన పడి ప్రాణాలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇప్పటి వరకు రక్తపోటు 120/80 ఎంఎంహెచ్‌జీ (మిల్టీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ) గా ఉంటే సాధారణంగా పరిగణించేవారు. అది దాటితే రక్తపోటు ఉన్నట్టుగానే భావించేవారు. అయితే ప్రస్తుతం ఈ లెక్కల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రక్తపోటు సమస్యను ఎదుర్కోంటున్న వారు అధికంగా ఉండడం కాస్తా ఆందోళన కలిగిస్తోంది. ఇక నుంచి 140/90 లోపు ఉంటే దానిని సాధారణంగానే పరిగణిస్తారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
డయస్టాలిక్ (హృదయ వ్యాకోచం), సిస్టోలిక్ (హృదయ సంకోచ సమయంలో గుండె కొట్టుకునే వేగం)కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది డబ్ల్యూహెచ్ఓ. డయస్టాలిక్ పోటు 90 ఎంఎంహెచ్‌జీ, అంతకుమించి రెండు రోజులపాటు ఉంటేనే దానిని రక్తపోటుగా పరిగణించాలని డబ్ల్యూహెచ్ఓ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే ధూమపానం, మద్యం అలవాటు, ఒకే చోట అదే పనిగా కూర్చుని పనిచేయడం, రోజుకు కనీసం అరంగట అయినా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వారికి, గుండె జబ్బులు ఉన్నవారికి సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 ఎంఎంహెచ్‌జీ వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
ఇప్పటివరకు యావత్ ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని.. వారిలో 14 శాతం మందిలో మాత్రమే బీపీ నియంత్రణలో ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 21 ఏళ్ల తర్వాత బీపీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం చేసింది. అధిక రక్తపోటు బాధితుల్లో దాదాపు 46 శాతం మందికి తమలో ఆ సమస్య ఉన్నట్టు గుర్తించలేరు. అందుకే బీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ఈ క్రమంలో 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు తరచూ బీపీని చెక్ చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బీపీని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలంచున్నారు నిపుణులు..
Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో కీలక మార్పులు.. కొత్తగా మరో ముగ్గురు..