Fever: జ్వరం తగ్గేందుకు ఎక్కువగా పారాసిటమాల్‌ వేసుకుంటున్నారా? డేంజర్‌లో పడినట్లే.. నిపుణుల వార్నింగ్

|

Dec 21, 2022 | 9:29 PM

డెంగ్యూ, టైఫాయిడ్ లేదా మలేరియా వంటి ప్రధాన వ్యాధులే కాకుండా, జ్వరానికి వందలాది కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. కొన్నిసార్లు, కొందరు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత జ్వరం బారిన పడవచ్చు.

Fever: జ్వరం తగ్గేందుకు ఎక్కువగా పారాసిటమాల్‌ వేసుకుంటున్నారా? డేంజర్‌లో పడినట్లే.. నిపుణుల వార్నింగ్
Taking Pills
Follow us on

వాతావరణ మార్పుల కారణంగా శీతాకాలంలో సీజనల్‌ రోగాలు బాగా వేధిస్తుంటాయి. చాలామంది జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇది కాకుండా ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా జ్వరం కూడా రావచ్చు. ఇలాంటి సమయాల్లో వెంటనే జ్వరం తగ్గేందుకు మాత్రలు వేసుకుంటుంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం రెండు రోజుల కంటే ఎక్కువ ఉండకపోతే, మీరు ఏ వైద్యుడిని సంప్రదించకుండా మందులు తీసుకోకూడదని లూథియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ ఎరిక్ విలియమ్స్ చెప్పారు. డెంగ్యూ, టైఫాయిడ్ లేదా మలేరియా వంటి ప్రధాన వ్యాధులే కాకుండా, జ్వరానికి వందలాది కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. కొన్నిసార్లు, కొందరు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత జ్వరం బారిన పడవచ్చు. ఈ రకమైన అలసట ఉన్న సందర్భాల్లో సొంత వైద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాటించకూడదు. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగించవచ్చు.

కేవలం జ్వరమే కాదు కొంచెం మంట లేదా తలనొప్పి అనిపించిన వెంటనే మందులు వేసుకునే అలవాటు ఉంటే వెంటనే ఆపివేయండి. ఈ అలవాట్లు కాలక్రమేణా మీ శరీరంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మీరు ఎక్కువ పారాసెటమాల్ తీసుకుంటే అది కాలక్రమేణా మీ శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి, సరైన మార్గదర్శకత్వం లేకుండా మందులు తీసుకోవడం వల్ల మీ కాలేయ వైఫల్యానికి దారి తీస్తుందని న్యూ ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మనోజ్ శర్మ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి