Health Tips: తరచూ తిమ్మిర్లు వస్తున్నాయా..? వెంటనే వైద్యుడిని సంప్రదించండి.. కారణం ఏమిటంటే..

|

Jan 06, 2023 | 6:10 PM

స‌మ‌స్యకు కారణాలేమిటని తెలుసుకోకుండా తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతిని వివిధ ఆరోగ్య స‌మ‌స్యల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తూ క్రమంగా..

Health Tips: తరచూ తిమ్మిర్లు వస్తున్నాయా..? వెంటనే వైద్యుడిని సంప్రదించండి.. కారణం ఏమిటంటే..
Tingling Causes
Follow us on

మన శరీరంలో వచ్చే మార్పులను ఎప్పుడైనా గుర్తుపడుతున్నారా..?  ఆ మార్పులను మీరు సరిగ్గా గుర్తించలేకపోతే లేదా నిర్లక్ష్యం చేస్తే.. మన ఆరోగ్యానికే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చేతులకు, కాళ్ళకు తిమ్మిర్లు రావడాన్ని మనం కనీసం ఒకసారి అయినా అనుభవించే ఉంటాం. శరీరం అలసిపోయినప్పుడు లేదా నరాలలో ప్రసరణ బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. కానీ తరచుగా తిమ్మిర్లు వస్తే అది అపెండక్టమీ ప్రమాదాన్ని పెంచుతాయి. నరాల మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు రక్త సరఫరా ఆగిపోతుంది లేదా అంతరాయం ఏర్పడుతుంది. నరాల మీద ఒత్తిడి ఉన్నప్పుడు చేతి తిమ్మిర్లు కనిపిస్తాయి. అందువల్ల, చేతి తిమ్మిరి తరచుగా కనిపిస్తే దానిని అసలు నిర్లక్ష్యం చేయవద్దు.

తరచూ వచ్చే తిమ్మిర్లపై దృష్టి పెట్టని పక్షంలో అనేక ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు ఉన్నాయి. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. అయితే ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నా కూడా కాళ్లు తిమ్మిరెక్కుతాయి. అలాగే అరికాలు, అరచేతిలో కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. ఇది అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే, ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ, తరచుగా జరుగుతుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు.

ఈ స‌మ‌స్యకు కారణాలేమిటని తెలుసుకోకుండా తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతిని వివిధ ఆరోగ్య స‌మ‌స్యల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తూ క్రమంగా తీవ్రమవుతూ ఉంటే మాత్రం ఇలాంటి వాటిని శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతాలుగా భావించాలి. రక్తంలో అధిక చక్కెర కారణంగా నరాలు దెబ్బతినడం వ‌ల్ల చేతులు, కాళ్ళు తిమ్మిరికి గుర‌వుతాయి. క‌డుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు వ‌చ్చే అద‌న‌పు ద్రవాలు శ‌రీరంలోని న‌రాల‌పై నొక్కడం వ‌ల‌న కూడా తిమ్మిర్లు వ‌స్తాయి.

చ‌ర్మం వ‌దులుగా మారి బొడ్డు ప్రాంతంలో కూడా తిమ్మిరి వ‌స్తుంది. ప్రస‌వించిన త‌ర్వాత కూడా తిమ్మిర్లు అలాగే ఉంటే వెంటనే చికిత్స పొందాలి. ల్యూప‌స్‌, రుమ‌టాయిడ్ ఆర్థరైటీస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల వ‌ల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి. మ‌నం తీసుకునే ఆహారంలో విట‌మిన్ బీ లేదా  విటమిన్‌ ఈ లోపించిన‌ప్పుడు అది న‌రాల‌పై ప్రభావం చూపి తిమ్మిర్లు వ‌చ్చేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ , హెచ్ఐవీ, అధిక‌ర‌క్తపోటు, టీబీ వంటి వ్యాధులను త‌గ్గించుకునేందుకు వాడే మందులు కూడా తిమ్మిర్లు వ‌చ్చేలా చేస్తాయి. అదేవిధంగా హెప‌టైటీస్ బీ, సీ, లైమ్ డిసీజ్ వంటి కొన్నిర‌కాల వైర‌ల్‌, బ్యాక్టీరియ‌ల్ ఇన్‌ఫెక్షన్లు న‌రాల‌ను దెబ్బతీయడం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభ‌మ‌వుతాయి. మూత్రపిండాలు స‌క్రమంగా ప‌నిచేయ‌క‌పోయిన‌ట్లయితే కూడా తిమ్మిర్లు క‌నిపిస్తాయి. జ‌న్యుప‌ర‌మైన రుగ్మత వ‌ల్ల కూడా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వ‌స్తాయి. న‌రాల‌పై ట్యూమ‌ర్లు పెరుగుతున్న సంద‌ర్భాల్లో, థైరాయిడ్ స‌మ‌స్యతో ఉన్నవారిలో, అలాగే ఎక్కువగా మ‌ద్యం తీసుకునే వారిలో కూడా తిమ్మిర్లు క‌నిపిస్తాయి.

మరిన్ని హెల్త్  టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..