Bird flu: మానవులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ.. కొత్త మహమ్మారి అవుతుందా అంటూ ఆందోళన..

కొన్ని రోజుల క్రితం మెక్సికోలో ఒక వ్యక్తి ఈ వైరస్ కారణంగా మరణించాడు. బర్డ్ ఫ్లూ కారణంగా మానవ మరణం సంభవించిన మొదటి కేసు ఇది. ఈ మరణం తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్డ్ ఫ్లూ గురించి ప్రపంచవ్యాప్త హెచ్చరికను జారీ చేసింది. కొద్ది రోజుల్లోనే భారతదేశంలో కూడా ఈ వైరస్ ఒక పిల్లవాడికి సోకినట్లు నిర్ధారించబడింది. పశ్చిమ బెంగాల్‌లో 4 ఏళ్ల చిన్నారిలో హెచ్5ఎన్1 వైరస్ కనుగొనబడింది. అత్యంత జనసాంద్రత ఉన్న మన దేశంలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం ఆందోళన కలిగించే అంశం.

Bird flu: మానవులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ..  కొత్త మహమ్మారి అవుతుందా అంటూ ఆందోళన..
Bird Flu Virus

Updated on: Jun 12, 2024 | 6:16 PM

కొన్ని నెలల క్రితం బర్డ్ ఫ్లూ అంటే H5N1 వైరస్ అమెరికాలో జంతువుల్లో వ్యాప్తి చెందడం ప్రారంభించింది. వేలాది ఆవుల్లో ఈ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ఈ వైరస్ డెన్మార్క్. కెనడాలోని జంతువులలో వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ దాదాపు 26 జాతులకు సోకినట్లు నిర్ధారించబడింది. అయితే ఇప్పటి వరకూ ఈ వైరస్ సాధారణంగా పక్షులలో మాత్రమే కనిపించేంది. ఇప్పటి వరకూ ఈ వైరస్ మిలియన్ల జంతువుల్లో, పక్షులలో వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ బర్డ్ ఫ్లూ పెద్ద ముప్పుగా మారుతున్నట్లు తెలుస్తోంది. దీనికి రెండు కారణాలున్నాయి.

మొదటిది కొన్ని రోజుల క్రితం మెక్సికోలో ఒక వ్యక్తి ఈ వైరస్ కారణంగా మరణించాడు. బర్డ్ ఫ్లూ కారణంగా మానవ మరణం సంభవించిన మొదటి కేసు ఇది. ఈ మరణం తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్డ్ ఫ్లూ గురించి ప్రపంచవ్యాప్త హెచ్చరికను జారీ చేసింది. కొద్ది రోజుల్లోనే భారతదేశంలో కూడా ఈ వైరస్ ఒక పిల్లవాడికి సోకినట్లు నిర్ధారించబడింది. పశ్చిమ బెంగాల్‌లో 4 ఏళ్ల చిన్నారిలో హెచ్5ఎన్1 వైరస్ కనుగొనబడింది. అత్యంత జనసాంద్రత ఉన్న మన దేశంలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం ఆందోళన కలిగించే అంశం.

ఎందుకంటే ఈ వైరస్ మనుషులకు సులభంగా వ్యాపించదు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌తో మానవులకు సోకిన కొన్ని కేసులలో రెండు కేసులు భారత దేశానికి చెందినవి. 2019లో ఒక కేసు నమోదు కాగా.. ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జంతువులలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మానవులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారితో ప్రమాదం పొంచి ఉంది.

ఇవి కూడా చదవండి

బర్డ్ ఫ్లూ ఎక్కడ నుంచి వచ్చిందంటే

1996లో చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లోని పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లలో బర్డ్ ఫ్లూ మొదటి కేసు కనుగొనబడింది. 1997లో ఈ వైరస్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ వైరస్ అనేక ఉత్పరివర్తనలు 2020 సంవత్సరంలో కనిపించాయి. 2022లో ఈ వైరస్ అడవి పక్షులలో కనిపించింది. ఈ సమయంలో ఈ వైరస్ కేసులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలం నుంచి లక్షల సంఖ్యలో హెచ్‌5ఎన్‌1 కేసులు నమోదవుతున్నాయి. భారీ సంఖ్యలో పక్షులు, జంతువులు ఈ వైరస్ బారిన పడుతున్నాయి. అయితే ఇప్పుడు మానవులలో ఈ వైరస్ సంక్రమణ ఆందోళనను గణనీయంగా పెరిగింది. దీంతో నిపుణులు అప్రమత్తమయ్యారు.

బర్డ్ ఫ్లూ మనుషులకు ఎలా వ్యాపిస్తుందంటే

రాజస్థాన్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఎన్ఆర్ రావత్ మాట్లాడుతూ.. పౌల్ట్రీ ఫామ్‌లలో పనిచేసే వ్యక్తులకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. వైరస్ సోకిన పక్షి మలం లేదా మూత్రాన్ని స్పర్శించడం ద్వారా ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్‌ సోకడం కష్టమైనప్పటికీ.. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బర్డ్ ఫ్లూలో మరణాల రేటు ఇతర వైరస్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇందులో మరణాల రేటు కోవిడ్ కంటే ఎక్కువ. ఈ వైరస్ నుంచి మానవులను రక్షించడానికి ఎటువంటి చికిత్స లేదు. అటువంటి పరిస్థితిలో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది.

కొత్త మహమ్మారిలా మారుతుందా?

బర్డ్ ఫ్లూ కొత్త మహమ్మారిలా మారుతుందో లేదో అంచనా వేయడం కష్టమని డాక్టర్ రావత్ అంటున్నారు. అయితే ఈ వైరస్ వేగంగా పెరుగుతోంది. చాలా కాలం పాటు ప్రజలలో ఉంటుంది. ఇప్పుడు జంతువుల మధ్య కూడా వేగంగా విస్తరిస్తోంది. అటువంటి పరిస్థితిలో మానవులలో సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. ఇందుకు సంబంధించి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోళ్ల పెంపకం చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

బర్డ్ ఫ్లూ నివారణ

పక్షులు, జంతువులకు వచ్చే బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ను నివారించడం అంత సులువు కాదని, అయితే మనుషుల్లో వచ్చే ఇన్ ఫెక్షన్ ను నియంత్రించవచ్చని అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ జుగల్ కిషోర్ చెబుతున్నారు. దీని కోసం పౌల్ట్రీని పెంచే వ్యక్తులు వ్యాధి సోకిన పక్షుల నుంచి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఏదైనా పక్షి లేదా జంతువుకు ఈ వైరస్ సోకితే అధికారులకు తెలియజేయమని సూచిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించమని చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us