Immunity Booster: కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి లేదని భయపడుతున్నారా..! ఆ గడ్డి రసం తీసుకుంటే చాలు

|

Mar 01, 2021 | 6:52 PM

రోజురోజుకు మారుతున్న జీవన శైలి.. ఉరుకుల పరుగుల జీవితం.. దీంతో ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో మనలో క్రమేపీ రోగనిరోధకశక్తి ...

Immunity Booster: కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి లేదని భయపడుతున్నారా..! ఆ గడ్డి రసం తీసుకుంటే చాలు
Follow us on

Wheatgrass Benefits : రోజురోజుకు మారుతున్న జీవన శైలి.. ఉరుకుల పరుగుల జీవితం.. దీంతో ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో మనలో క్రమేపీ రోగనిరోధక శక్తి క్షీణిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ప్రస్తుతం కరోనా వైరస్ తో పోరాటం రోగనిరోధక శక్తి మాత్రమే చేస్తుందని.. అందుకనే అందరూ దీనిని పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు కూడా. అయితే ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అలాంటి ఓ కృతి ప్రసాదిత వస్తువు గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డిలో 13 రకాల విటమిన్లు, 111 రకాల పోషకాలున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలిందని డాక్టర్ దొరస్వామి చెప్పారు. ఇక ఈ గడ్డిలో ముఖ్యంగా విటమిన్లు, ఎంజైమ్‌లు, అమినో ఆసిడ్‌లు, ప్రోటీన్‌లు ఉన్నాయి.గోధుమ గడ్డి రసాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల సత్తువ ఇమిడి ఉంటుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. దీంతో గోధుమ గడ్డిని ‘జీవం కలిగిన ఆహారం గా ‘ పేర్కొనవచ్చు. దీనీలో విటమిన్ “ఈ ‘తో పాటు ఇతర పోషకాలు ఉన్నాయి.

గోధుమరసం తయారీ విధానం :

గోధుమలను 12 గంటలు నానబెట్టాలి. ట్రేలల్లో ఒక ఇంచు వరకు మట్టి పోసి విత్తనం వేయాలి. దానిపై సన్నటి మట్టిని చల్లి నీళ్లు చిలుకరించాలి. 4వ రోజుకు మొలకలు వస్తాయి. 8వ రోజు గడ్డి పెరిగాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సిలో వేసి సరిపడ నీళ్లు పోసి రసం తీయాలి. ఆ రసాన్ని పాలిస్టర్ గుడ్డలో వంపి గట్టిగా పిండాలి. వచ్చిన రసాన్ని పరగడుపున తాగితే మంచి ఫలితాల్ని ఇస్తుంది. 20 నిమిషాల తర్వాత ఏమైనా తినవచ్చును.

రసంతో కలిగే లాభాలు :

*గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో ‘ఎ’ విటమిన్‌, బి కాంప్లెక్స, సి,ఇ,కె విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌, ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది.
*రక్త శుద్దికి, శరీర కణాల పునర్జన్మకు ఉపయోగపడుతుంది. అలసటను తగ్గిస్తుంది. కాన్సర్ వ్యాధి పెరుగుదలను నివారిస్తుంది.
*గోధుమ గడ్డి రసం త్రాగడం వలన శరీరములోని విషపూరితాలన్ని బయటికు విసర్జింపబడతాయి.
* గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి.
* గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశంలోని కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది.
* ‘తల సేమియా’ రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుందని ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో తేలింది.
* పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, బహిష్టు సమస్యల నివారణకు ఉపకరిస్తుంది.
* మధుమేహం, పైల్స్, గ్యాస్, కడుపులో పుండు తదితర సమస్యలకు పనిచేస్తుంది.
* రక్తంలో చెక్కర శాతం, మల బద్దకాన్ని తగ్గిస్తుంది.
* రక్తహీనత, శ్వాస, చెమట సమస్యల నివారణ
* గోధుమ గడ్డి గుజ్జును పసుపు, పాలతో కలిపి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు, పగలటం, నల్లబడటాన్ని నివారించవచ్చు.
* శరీరం బరువు పెరగటాన్ని, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది

మొత్తంగా 8 రోజులు పెరిగిన గోధుమ నారు రసం నిత్యం తీసుకోవడం వలన శరీరానికి సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది.

Also Read:

 ఆ సమయంలో ఇవి తింటే తెలివైన, చురుకైన శిశువు మీ సొంతం

గత ఆరునెలల్లో ఆధార్ కార్డుని ఎన్ని సార్లు ఉపయోగించారో తెలుసుకోవడం ఎలా అంటే..!