Telugu News Health What to do if you have a heart attack when you are alone?
Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?.. కచ్చితంగా తెలుసుకోండి
మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా ప్రస్తుత రోజుల్లో జనాలు ఎందుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె పోటు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి ఈ వ్యాధిబారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే చాలా వరకు బాధితులు ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ గుండెపోటు సమస్యను ఎదుర్కొంటున్నట్టు వైద్యనిపుణులు గుర్తించారు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఎలాంటి జాగ్రత్తలో తీసుకోవాలో వివరించారు. అవేంటో ఇప్పుడు మనం తెలసుకుందాం.
మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా ప్రస్తుత రోజుల్లో జనాలు ఎందుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె పోటు. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులలో కొవ్వు పేరుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు ఈ గుండెపోటు వస్తుంది. అయితే చాలా వరకు బాధితులు ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ గుండెపోటు సమస్యను ఎదుర్కొంటున్నట్టు వైద్యనిపుణులు గుర్తించారు. అలాంటి సమయంలో అత్యవసర సహాయం పొందడంలో ఆలస్యం చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. కాబట్టి, మీరు గుండెపోటు లక్షణాలను అనుభవిస్తే, మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి మీరు వెంటనే తీసుకోగల చర్యలను తెలుసుకోవడం చాలా అవసరం.
మీరు ఒంటిరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?
తక్షణ సహాయం కోసం 108 లేదా ఇతర స్థానిక అత్యవసర నంబర్‌కు కాల్ చేయండి.
వైద్యుడికి ఫోన్ చేసి మీ పరిస్థితి గురించి తెలియజేయండి, వారి సూచనలను పాటించండి.
అంబులెన్స్ వచ్చేంతవరకు వేచి ఉండే ముందు, మీ ఇంటి తలుపు తెరిచి ఉంచండి.
మీ వైద్యుడు సూచించిన విధంగా ఆస్ప్రిన్ టాబ్లెట్ తీసుకోండి. దాన్ని నీళ్లు కలపకుండా నమలండి.
ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం, రక్తం పలుచబడటం ద్వారా గుండెపోటు తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆ వెంటనే సౌకర్యవంతమైన ప్రదేశంలోకి వెళ్లి కూర్చోండి.
మీకు తల తిరుగుతున్నట్లు అనిపిస్తే, మీ ఎడమ వైపుకు తిరిగి కాళ్ళు ముడుచుకుని పడుకోండి. ఇలా చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ముఖ్యంగా మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతమైన శ్వాస తీసుకోండి. మీకు త్వరలోనే సహాయం అందబోతుందని గుర్తుంచుకోండి
అంబులెన్స్ వచ్చే వరకు మిమ్మల్ని ఓదార్చగల, సహాయం చేయగల స్నేహితుడికి, కుటుంబ సభ్యుడికి లేదా పొరుగువారికి వెంటనే కాల్ చేయండి.
గుండెపోటు వచ్చే ముందు మీలో కనిపించే ప్రధాన లక్షణాలు
ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా భారంగా అనిపించడం
ఈ నొప్పి చేతులకు (ముఖ్యంగా ఎడమ చేయి), మెడ, దవడ బయటికి వ్యాపించవచ్చు.
శరీర నొప్పులు, వికారం, వాంతులు రావచ్చు అలాగే మీరు అధికంగా చెమటలు పట్టవచ్చు
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)