Diabetics: షుగర్ పేషెంట్లు ఈ పండ్లని తింటున్నారా.. ఒక్కసారి ఈ విషయాలు గమనించండి..!

|

Mar 01, 2022 | 7:47 PM

Diabetics: భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీరు తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఒక్కసారి డయాబెటీస్‌

Diabetics: షుగర్ పేషెంట్లు ఈ పండ్లని తింటున్నారా.. ఒక్కసారి ఈ విషయాలు గమనించండి..!
Diabetics
Follow us on

Diabetics: భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీరు తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఒక్కసారి డయాబెటీస్‌ బారిన పడితే జీవితాంతం ఆహారం, పానీయాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. ఇన్సులిన్ పవర్ తగ్గిపోవటంతో శరీరంలోని రక్తంలో అధిక గ్లూకోజు నిల్వల కారణంగా షుగ‌ర్ వ్యాధి వస్తుంది. అర‌వై ఏళ్లకు రావాల్సిన ఈ వ్యాధి నేటి కాలంలో ఇర‌వై, ముప్పై ఏళ్లకే వ‌స్తుంది. అధికంగా బరువు ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, కొన్ని సందర్భాల్లో వారసత్వ ప‌రంగా కూడా డయాబెటీస్ వస్తుంది. స్వీట్లని ఇష్టపడే వారు మధుమేహ బాధితులలో చాలామంది ఉంటారు. అలాంటి వారు సహజసిద్దమైన ఆహారాలపై దృష్టి సారించాలి. సాధార‌ణంగా డయబెటీస్ పేషెంట్లు పండ్లు తినకూడదని అంటారు. కానీ పూర్తిగా పండ్లికి దూరమైతే వాటి నుంచే వ‌చ్చే పోష‌కాలు కూడా దూరమవుతాయి. అందుకోసం పండ్లని తినాలి. కానీ ఎంతమేరకు అనేది తెలుసుకుందాం.

సీతాఫలం

ఇందులో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే. షుగ‌ర్ పేషెంట్లు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే దానిమ్మ మ‌ధ‌మేహ రోగుల‌కు మంచి ఆహారం. అలా అని ఓవ‌ర్‌గా తీసుకోకూడ‌దు. రోజుకు ఒక‌టి తింటే రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

అరటి పండు

అరటిపండు బరువు తగ్గడం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనం, రక్తహీనతలని తగ్గిస్తుంది. ఈ పండులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు అర‌టిపండును పూర్తిగా తిన‌డ‌కుండా సగం ముక్క తీసుకుంటే చాలు.

యాపిల్

మిగిలిన పండ్లన్నింటిలో కంటే యాపిల్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. యాపిల్ కొలెస్ట్రాల్ నిలువలు తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అయితే డయాబెటీస్‌ రోగులు రోజుకు ఒక యాపిల్ తింటే ఎలాంటి స‌మ‌స్యలు ఉండ‌వు. అంత‌కు మించి తింటే మాత్రం అనేక స‌మ‌స్యలు ఎదుర‌వుతాయి.

బొప్పాయి

బొప్పాయి గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. షుగర్‌ని అదుపులో ఉంచుతుంది. కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అయితే బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తీసుకుంటే అంతే చెడ్డది. కాబ‌ట్టి షుగ‌ర్ పేషెంట్లు బొప్పాయిని మితంగా తీసుకోవాలి.

Deadline: ఈ మూడు పనులకి మార్చి 31 గడువుతేదీ.. త్వరపడకపోతే పెనాల్టీలు భరించలేరు..!

Evening Snacks: సాయంత్రం స్నాక్స్‌గా ఇవి తింటే సూపర్.. రుచితో పాటు మంచి ఆరోగ్యం..

Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!