Medlar Fruit: ప్రపంచంలో ఏ పండుకు లేని ప్రత్యేకత దీని సొంతం.. కుళ్ళిన తర్వా త తినాలి.. లేదంటే అనారోగ్యమే

|

Jun 26, 2021 | 9:41 PM

Medlar Fruit: పండ్లు..ఒకొక్క పండుకి ఒకొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్నింటిని పచ్చిగా తింటే.. బాగుంటాయి.. కొన్ని పండ్లు పండిన తర్వాత తింటే రుచిగా ఉంటాయి. అయితే ప్రపంచంలో ఏ పండుకీ లేని ప్రత్యేకత...

Medlar Fruit: ప్రపంచంలో ఏ పండుకు లేని ప్రత్యేకత దీని సొంతం.. కుళ్ళిన తర్వా త తినాలి.. లేదంటే అనారోగ్యమే
Medlar Fruit
Follow us on

Medlar Fruit: పండ్లు..ఒకొక్క పండుకి ఒకొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్నింటిని పచ్చిగా తింటే.. బాగుంటాయి.. కొన్ని పండ్లు పండిన తర్వాత తింటే రుచిగా ఉంటాయి. అయితే ప్రపంచంలో ఏ పండుకీ లేని ప్రత్యేకత.. ఓ పండుకు ఉంది. ఈ పండును పచ్చిగానీ కానీ.. పండుగా కానీ తిండడానికి పనికిరాదు. ఈ పండ్లు కుళ్ళిన తర్వాత మాత్రమే తినడానికి ఉపయోగపడతాయి. వీటిని మెడ్లర్ ఫ్రూట్ అంటారు.ఒకప్పుడు యూరప్‌లో ఈ పండుకి విపరీతమైన డిమాండ్ ఉండేది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన గ్రీకు కవిత్వంలో ఈ ఫ్రూట్ ప్రస్తావన కనిపిస్తుంది. నెమ్మదిగా ఈ పండు రోమన్ కు చేరుకుంది. ఈ చెట్లు చాలా అసాధారణమైనవి. ఇవి డిసెంబరులోమాత్రమే కాస్తాయి.

ఈ పండ్లను చెట్టు నుంచి కోసే సమయంలో ఉల్లిపాయ రూపంలో పచ్చగా, గోధుమ రంగులో ఉంటాయి. యాపిల్ రుచిని గుర్తు చేసే ఈ పండును చెట్టునుంచి కోసిన వెంటనే తినకూడదని.. అలా తింటే అనారోగ్యానికి గురవుతారని 18వ శతాబ్దపు వైద్యులు హెచ్చరించారు.

అయితే వీటిని కొన్ని రోజులపాటు మగ్గబెట్టి.. కుళ్ళిన తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. ఈ పండులో ఉండే ఎంజైములు క్లిష్టమైన కార్బోహైడ్రేట్‌లను తేలికపాటి చక్కెరలాగా ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌గా మారుస్తుంది. దీని వల్లే వీటికి పుల్లటి రుచి వస్తుంది.ఈ ప్రక్రియనే బ్లేట్టింగ్ అని అంటారు. ఈ పదాన్ని1939లో ఒక బోటనిస్ట్ కనిపెట్టారు.ఈ ప్రక్రియ వల్ల దీనికి బాగా పండిన కర్జూరాన్ని నిమ్మకాయలతో కలిపితే వచ్చే రుచి వస్తుంది.  ఈ పండ్లలో విటమిన్లు, 80% కంటే ఎక్కువ నీరు ఉన్నాయి. మెడ్లార్ దాహార్తిని తీరుస్తుంది. తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది కనుక బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు మంచిది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పండ్లు తినవచ్చు.

Also Read: పొట్ట కొవ్వు .. అధిక బరువు తగ్గాలంటే ఏమి చేయాలో తెలుసా..