దంతాల రంగును బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. పళ్లు మిలమిల మెరిసిపోవాలని అనుకోని వారుండరు. దంతాల కారణంగా చాలా మంది నలుగురిలో నవ్వడానికి కూడా సిగ్గు పడుతూంటారు. ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. పళ్లు ఒక్కోసారి నలుపుగా, పసుపు రంగులోకి, బ్రౌన్ కలర్ లోకి మారుతూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి దంతాలు అనేవి సెన్సిటీవిటీకి కూడా గురవుతూంటాయి. దీని కారణంగా వేడి లేదా చల్లగా ఉన్న పదార్థాలను తినలేరు.. తాగలేరు. బ్రష్ సరిగా చేయకపోవడం వల్ల, సరిగ్గా మౌత్ వాష్ చేయకపోవడం వల్ల కూడా దంతాలు రంగు మారుతూ ఉంటాయి. ఇలా బ్యాక్టీరియా కూడా చేరి దంతాలు పాడవుతాయి. అయితే ఇలా పళ్లను రంగు బట్టి.. మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో.. మీ దంతాలు ఏ రంగులో ఉన్నాయో తెలుసుకోండి.
పసుపు రంగు:
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ పళ్లు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఉపరితలంపై ఉన్న ఎనామెల్ కాలక్రమేణా పసుపు రంగును బహిర్గతం చేస్తుంది. అలాగే ఆహారపు అలవాట్ల కారణంగా కూడా దంతాలు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎక్కువగా కాఫీ, టీ, సోయా సాస్ తిన్నప్పుడు ఈ మరకలు ఏర్పడతాయి. పసుపు రంగుతో ఇబ్బంది పడుతున్న వారు దంతాలను ఉదయం, రాత్రి శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
బూడిద రంగు:
దంతాల్లో రక్త సరఫరా లేకపోవడం వల్ల పళ్లు బూడిద రంగులోకి మారతాయి. దంతాలకు గాయం అయినప్పుడు లేదా నరాల నష్టం జరిగినప్పుడు ఇలా గ్రే కలర్ లోకి వస్తాయి. కావిటీస్ పూరించడానికి ఉపయోగించే పదార్థం కూడా దంతాలను బూడిద రంగులోకి మార్చగలవు. ఇలా పళ్లు ఈ కలర్ లోకి మారితే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.
పర్పుల్ కలర్:
రెడ్ వైన్ ఎక్కువగా తాగినప్పుడు దంతాలు నార్మల్ గా ఊదా రంగులోకి మారతాయి. అలాగే బెర్రీలు, దానిమ్మ వంటి పండ్లు తిన్నప్పుడు కూడా ఇలా పర్పుల్ కలర్ లోకి దంతాలు మారతాయి. ఇలా దంతాలు ఈ కలర్ లోకి మారితే అంతర్గతంగా రక్త స్రావాన్ని సూచిస్తుంది.
నలుపు:
దంతాలు ఎప్పుడైతే నలుపు రంగులోకి వచ్చాయో.. అవి క్షీణించే దశకు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ కలర్ లోకి వస్తే.. ఓవర్ టైమ్ దంతాల నష్టానికి దారి తీస్తుంది.
కాబట్టి ముందు నుంచే దంతాల పట్ల జాగ్రత్తలు వహించాలి. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించడం బెటర్.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.