పైల్స్ వచ్చినవారికి బాధ మామూలుగా ఉండదు. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. లోపలి బాధ ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియకి ఇబ్బంది పడతారు. పైల్స్(Piles) మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తం(Blood)తో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు పొడుచుకు వస్తాయి. ఈ మొలలనే హేమోరాయిడ్స్(hemorrhoids) అని వైద్య పరిభాషలో అంటారు. మరి ఇవి ఎందుకొస్తాయో.. ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.. పని చేసే చోట లేదా ఇంట్లో ఒకే చోట కదలకుండా కూర్చునే వారికి ఈ మొలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, మానసికంగా స్ట్రెస్‌కు గురవడం వంటి వాటివల్ల కూడా ఇవి వస్తాయి. చాలా మంది నీళ్లను తాగడానికి అస్సలు ఇష్టపడరు. కానీ నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా అర్శమొలలు వచ్చే అవకాశం ఉంటుంది.
జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రై చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే కూడా మొలలు వస్తాయి. మలబద్దకం సమస్య ఉన్న వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. గట్టి గట్టిగా దగ్గే వారికి కూడా అర్శమొలలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మలవిసర్జన చేసేటప్పుడు ఎక్కువగా ముక్కేవారు ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. మలద్వారంలో నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ నాళాలపై ఒత్తిడి ఏర్పడితే అవి వాచి రక్తంతో నిండి పిలకలుగా మారుతాయి. అవి ముదిరితే.. అవి మలద్వారం గుండా బయటకు పొడుచుకొస్తాయి. అంతేకాదు మలవిసర్జన సమయంలో అవి తీవ్రమైన నొప్పిని పుట్టిస్తాయి. ఒక్కో సారి ఏకంగా రక్తం కూడా కారుతుంది.
అర్శమొలల సమస్య ఉన్న వారు ఒంట్లో వేడిని పుట్టించే ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చళ్లు, చింతపండు, కారం, ఊరగాయలు, మాసాలలకు దూరంగా ఉండాలి. ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎక్కువగా కాయకూరలు, ఆకు కూరలు వంటి పీచు పదార్థం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. మొదటి నుంచి నీళ్లను ఎక్కువగా తాగే వారికి అర్శమొలలు వచ్చే అవకాశం ఉండదట. మలవిసర్జన చేస్తున్నప్పుడు అర్శమొలలు బయటకు వచ్చి, విసర్జన తర్వాత మళ్లీ లోపలికి పోతాయి. ఇవి మొలలు మొదటి దశలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇక రెండో దశలోకి వచ్చే సరికి మొలలు ఎప్పుడు బయటే ఉంటాయి. అయితే వాటిని చేత్తో ముట్టుకుని పుష్ చేస్తేనే లోపలికి వెళ్లిపోతాయి. లేదంటే బయటే ఉంటాయి. ఇక మూడు దశలోకి వచ్చే సరికి అర్శమొలలు పూర్తిగా బయటనే ఉంటాయి. చేత్తో నెట్టినా లోపలికి పోవు. కానీ స్టేజ్‌లో వాటి నుంచి వచ్చే నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. అవి ముదిరిపోతే సరిగ్గా నిలబడం, కూర్చోవడం, నడవడం కూడా కష్టమవుతుంది. ఈ మొలల కారణంగా క్యాన్సర్ బారిన కూడా పడొచ్చు. అర్శమొలలు వస్తే విసుగు, కోసం ఎక్కువగా వస్తదట.
గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనల ప్రకారం.. ఇతర వెబ్ సైట్స్ ప్రకారం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ పద్దతులను అనుసరించడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.
Read Also.. Iron Deficiency: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఐరన్ లోపమే..!