Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..

|

Sep 11, 2022 | 1:38 PM

ఉరుకుల పరుగుల జీవితంలో.. ఎప్పుడు నిద్రపోతున్నామో.. సరైన సమయానికి భోజనం చేస్తున్నామో అస్సలు తెలియని పరిస్థితి.

Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..
Weight Loss
Follow us on

ఉరుకుల పరుగుల జీవితంలో.. ఎప్పుడు నిద్రపోతున్నామో.. సరైన సమయానికి భోజనం చేస్తున్నామో అస్సలు తెలియని పరిస్థితి. వెరిసి బరువు పెరిగిపోతుంటాం. ఇప్పుడు చాలామంది యువతకు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం, కొలెస్ట్రాల్, హైబీపీ లాంటి సమస్యలు దరికి చేరుతున్నాయి. మరి అవన్నీ రాకూడదంటే.. ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు.. జీవన విధానంలోనూ పలు మార్పులు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకోసం ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..

Weight Loss Tips:

  • ఊబకాయం వస్తోందంటే.. దాని ప్రధాన కారణం. మన ఆహారపు అలవాట్లే. అందుకే శరీరానికి పౌష్టికాహారం అందేలా చూసుకోవడమే కాదు.. జీవన విధానంలోనూ పలు మార్పులు పాటించండి. అంతేకాకుండా అందుకు తగిన వ్యాయామాలను కూడా చేయండి.
  • రోజూ ఉదయాన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. గుండె ఆరోగ్యం, కండరాలు, ఎముకల దృడత్వాన్ని పెంచే ఎక్సర్‌సైజులు చేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
  • బరువు తగ్గాలనే క్రమంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తారు. అలా అస్సలు చేయకండి.. ఒకవేళ మీరు అలా చేస్తే.. బరువు తగ్గడం అటుంచితే.. అమాంతం బరువు పెరుగుతారు.
  • ఆహారం మితంగా తీసుకోవాలి.. దానికి తగ్గట్టుగా క్యాలరీలు బర్న్ చేయాలని డాక్టర్లు అంటున్నారు.
  • జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి.. ఇంటి నుంచి తీసుకెళ్లే ఆహారాన్ని ప్రిఫర్ చేయండి.
  • ఆకలిగా అనిపించినప్పుడల్లా యాపిల్ తినండి.. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
  • శరీరానికి ఆహారం ఒక్కటే కాదు.. తగిన మోతాదులో నీరు కూడా తాగడం ముఖ్యం. రోజుకు 3-4 లీటర్లు తాగాలి. అప్పుడే జీర్ణశక్తి, రక్త సరఫరా, శరీరం పని తీరు మెరుగ్గా ఉంటాయి.
  • ఏ ఆహార పదార్ధాలు తీసుకున్నా.. క్యాలరీలు మోతాదులో ఉండేలా చూసుకోండి. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలు తినడం తగ్గించండి.
  • ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా.. చక్కెర, కొవ్వు, నూనె తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఉరుకులు పరుగుల మీద కాకుండా.. నెమ్మదిగా తినడం నేర్చుకోండి.
  • కడుపుకి కావల్సినంత తిండి.. కంటికి కావల్సిన నిద్ర ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరికి చేరవు అని డాక్టర్లు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. వీటిలో ఏవైనా పాటించాలని అనుకుంటే, తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.