Walking Benefits: నడకతో కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.. ఎంతసేపు నడవాలి..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు

|

Sep 23, 2022 | 8:52 PM

బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లడానికి సమయం లేకపోతే.. క్రమం తప్పకుండా నడవండి.. మీరు బరువు తగ్గుతారు. అయితే ఎంత సమయంలో నడవాలి.. ఎంత దూరం నడవాలి..

Walking Benefits: నడకతో కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.. ఎంతసేపు నడవాలి..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు
Walking Benefits
Follow us on

“ఆరోగ్యమే మహాభాగ్యం” ఆ మహాభాగ్యం ఎలా దక్కాలి..? ఏం చేస్తే దక్కుతుంది..? అయితే కొందరు ఉదయం నుంచే వాకింగ్ రన్నింగ్, యోగా చేసేందుకు నిద్రకు ఉపక్రమించే ముందే ప్లాన్ చేసుకుంటారు. ఉదయం రాత్రి అనుకున్న ప్లాన్‌ను పక్కన పెట్టేస్తారు. ఈ రోజు కాదు మరో రోజు అనుకుంటూ అలానే మజ్జుగా నిద్రపోతారు. అయితే మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. అయితే వ్యాయామం అన్నింటిలోనూ చాలా తేలికైంది. ఖ‌ర్చు అస్సలు ఉండదు.. ఇందులో జిమ్ కాకుండా వాకింగ్‌ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

బరువు పెరగడం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. బరువును నియంత్రించుకోవడానికి ప్రజలు రకరకాల పద్ధతులను అవలంబిస్తారు. డైట్ కంట్రోల్ చేయడం నుంచి మొదలు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్ చేసినా బరువు తగ్గరు. అయితే ఇలా కొన్ని రోజులు జిమ్‌లో వర్కవుట్ చేసి.. ఆ తర్వాత జిమ్ మొత్తం మానేస్తారు. అయితే బరువు తగ్గడానికి జిమ్‌లో వర్కవుట్ చేయనవసరం లేదని, రెగ్యులర్‌గా నడవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మ‌రి ఆ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

బరువు తగ్గడానికి, నడక, ఆహారం యొక్క సమయం, తీవ్రత చాలా ముఖ్యమైనవి. మీరు శారీరక శ్రమ చేయడం. కేలరీలను తగ్గించడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నడక అనేది కేలరీలను సులభంగా బర్న్ చేసే ఒక చర్య. మీరు ప్రతిరోజూ అరగంట పాటు వేగంగా నడిస్తే, మీరు బరువును సులభంగా నియంత్రించవచ్చు. మీరు రోజుకు 30 నిమిషాల పాటు నడవడం ద్వారా దాదాపు 150 కేలరీలు బర్న్ చేయవచ్చు. నడక బరువు, పొట్ట కొవ్వును ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం.

నడక బరువును ఎలా తగ్గిస్తుంది?

క్రమం తప్పకుండా నడవడం ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. జర్నల్ ఆఫ్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ అండ్ బయోకెమిస్ట్రీలో ఒక అధ్యయనం ప్రకారం.. నడక శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. నిరంతరం నడవడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుంది.

వీరి అధ్యయనం ప్రకారం, మహిళలు మొత్తం 12 వారాల పాటు వారానికి 3 రోజులు అంటే.. 50-70 నిమిషాలు నడవాలి. ఈ అధ్యయనం తర్వాత వచ్చిన ఫలితాల ప్రకారం సగటున 1.5% శరీర కొవ్వును, నడుము చుట్టూ 1.1 అంగుళాల కొవ్వును కరిగించిటన్లుగా వారు కనుగొన్నారు.

నడక వల్ల కలిగే ప్రయోజనాలు:

కాలిఫోర్నియాలోని బర్కిలీలోని లైఫ్ సైన్స్ డివిజన్‌లోని లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీలో నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం.. చురుకైన నడక అధిక రక్తపోటును నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. నడక గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది. ఊబకాయం, గుండె, షుగర్ వ్యాధులను నియంత్రించడం అవసరం. లేకపోతే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అయితే వాకింగ్ చేసే వారు రోజుకు క‌నీసం గంట అయినా వాకింగ్ చేసేలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే వాకింగ్‌తో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే గంట సేపు వాకింగ్ ఒకేసారి చేయ‌లేక‌పోతే ఉద‌యం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున చేయ‌వ‌చ్చు. ఇలా వాకింగ్‌ను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం