Vaccination: కోవిడ్ టీకా రెండు డోసులు సరిపోవా? ఫైజర్ సీఈవో ఏమంటున్నారంటే..

|

Apr 16, 2021 | 5:10 PM

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో వ్యాక్సినేషన్ ప్రక్రియపైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. కరోనా టీకాలు రెండు డోసులు తీసుకుంటే.. కరోనా బారి నుంచి రక్షించుకోవచ్చని అంతా అనుకుంటున్నారు.

Vaccination: కోవిడ్ టీకా రెండు డోసులు సరిపోవా? ఫైజర్ సీఈవో ఏమంటున్నారంటే..
Pfizer Biontech Covid 19 Vaccine
Follow us on

Vaccination: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో వ్యాక్సినేషన్ ప్రక్రియపైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. కరోనా టీకాలు రెండు డోసులు తీసుకుంటే.. కరోనా బారి నుంచి రక్షించుకోవచ్చని అంతా అనుకుంటున్నారు. టీకా ఒక్కటే కరోనా బారినుంచి కాపాడగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా అందుబాటులో ఉన్నంత వరకూ ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా, మోడెర్నా, ఫైజర్, కొవాగ్జిన్ వంటి టీకాలు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్న తరువాత నెల రోజులకు తప్పనిసరిగా రెండు టీకాలు తీసుకోవాలి. అదే జాన్సన్ కంపెనీ అందుబాటులోకి తీసుకువచిన వ్యాక్సిన్ మాత్రం ఒక్క డోసు సరిపోతుంది. మనదేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు.. కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండూ అందుబాటులో ఉన్నాయి. మరో వ్యాక్సిన్ స్ఫుత్నిక్ వి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మూడు టీకాలు కూడా రెండు డోసులు తీసుకోవాల్సిందే. రెండు డోసులూ టీకా తీసుకుంటే కరోనా ముప్పునుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతూ వస్తున్నారు.

కానీ, ఏడాది లోపు మూడు డోసులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఫైజర్ సీఈఓ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకూ రెండు డోసులు సరిపోతాయనుకుంటున్న ప్రజలకు షాక్ తగిలినట్టయింది. తమ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ ఏడాదిలోపే మూడో డోసు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఫైజర్ సంస్థ సీఈఓ అల్బెర్ట్ బౌర్లా అన్నారు. అంతేకాదు, కరోనా లాంటి వైరస్ కు ప్రతి సంవత్సరం టీకా తీసుకోవడం అవసరమని చెప్పారు.

‘‘కోవిడ్ పరిణామ క్రమం ఎలా ఉంటోందో మనం గమనించాలి.. మనం ఎంత వరకు వ్యాక్సినేషన్ అలా కొనసాగించాలి అనేది చూడాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుత పరిస్థితిని బట్టి మూడో డోస్ అవసరం.. ఇది ఆరు నెలలు నుంచి ఏడాది మధ్య ఉంటుంది.. అక్కడ నుంచి ఏటా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.. కానీ ఈ అంశాన్ని ధ్రువీకరించాల్సి అవసరం ఉంది’’ అని ఫైజర్ సీఈఓ తెలిపారు. వైరస్ బారినపడే అవకాశాన్ని అణచివేయడం చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు. ఇక, కోవిడ్-19 టీకాతో వచ్చే యాంటీబాడీల వల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందో తెలియదు. ఈ విషయం గురించి పరిశోధకులు ఖచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇక, ఫైజర్ ఇటీవలే క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విడుదల చేసిన ఫైజర్.. తమ టీకా 91 శాతం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తెలిపింది.

రెండో డోస్ తీసుకున్న తర్వాత ఆరు నెలల వరకు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో 95 శాతం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని ఫైజర్ పేర్కొంది. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం దీనికి సంబంధించి మరింత సమాచారం అవసరమని భావిస్తున్నారు. కరోనా వేరియంట్ల నుంచి రక్షించుకోవాలంటే బూస్టర్ డోస్‌లు తీసుకోవాలని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ, జో బైడెన్ కోవిడ్ రెస్పాన్స్ టీమ్ హెడ్ డేవిడ్ కెస్లార్ గురువారం హెచ్చరించారు. కోవిడ్ యాంటీబాడీల కాలపరిమితిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ధారణకు రాలేకపోతున్నామనీ అయన తెలిపారు.

Also Read: Corona Second Wave: కోవిండ్ సెకండ్ వేవ్ యమ డేంజర్… వారికీ ఎక్కువ రిస్కే అంటున్న వైద్య నిపుణులు..

COVID-19: మట్టిలో నెలరోజుల పాటు సజీవంగానే కరోనా వైరస్..కొత్త టెన్షన్ పుట్టిస్తున్న తాజా పరిశోధనలు!