Health Tips: ముఖంపై వేడి మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా.. సింపుల్‌గా ఇలా చేయండి..!

Health Tips: శరీర వేడి వల్ల వచ్చే మొటిమలను వేడి మొటిమలు అంటారు. ఇవి బుగ్గలు, నుదిటిపై ఏర్పడుతాయి. వీటిని వదిలించుకోవడం అంత సులభం కాదు.

Health Tips: ముఖంపై వేడి మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా.. సింపుల్‌గా ఇలా చేయండి..!
Heat Pimples

Updated on: Apr 04, 2022 | 9:22 PM

Health Tips: శరీర వేడి వల్ల వచ్చే మొటిమలను వేడి మొటిమలు అంటారు. ఇవి బుగ్గలు, నుదిటిపై ఏర్పడుతాయి. వీటిని వదిలించుకోవడం అంత సులభం కాదు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోకపోవడం, మద్యం ఎక్కువగా తాగడం, బ్యాక్టీరియా, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం మొదలైన కారణాల వల్ల మొటిమలు వస్తాయి. అయితే వీటిని కొన్ని హోం రెమిడిస్ ద్వారా తొలగించుకోవచ్చు. వాస్తవానికి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మొటిమలు ఏర్పడుతాయి. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. ఇది వేడి మొటిమలను తొలగించడంతో పాటు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

తేనె

తేనెను అప్లై చేయడం వల్ల ముఖం చల్లబడుతుంది. మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక పెద్ద చెంచాలో తేనె తీసుకుని దానికి కొద్దిగా పచ్చి పాలు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేయండి.

పసుపు

మొటిమలకు పసుపు మంచి విరుగుడు. ఇందులో కర్కుమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మొటిమల వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. పసుపు పొడిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి, మొటిమల మీద రాసి, ఆరనివ్వండి. తర్వాత కడిగితే మంచి ఉపశమనం ఉంటుంది.

నిమ్మకాయ

మొటిమలను తొలగించడంలో నిమ్మకాయ కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి మొటిమలపై అప్లై చేయాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

అలోవెరా జెల్

కలబంద చర్మానికి చాలా మంచిది. ఇది ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. వేడి మొటిమలకి చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. అలోవెరా జెల్‌ని మొటిమలపై పూయాలి. రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేస్తే కొద్ది రోజుల్లో మొటిమలు తగ్గుముఖం పడుతాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Health Tips: వేసవిలో ఈ 3 ఆహారాలు బెస్ట్.. ఎందుకంటే బరువు పెంచవు..!

Green Almonds: ఆకుపచ్చ బాదంతో అనేక లాభాలు.. ఈ సమస్యలతో బాధపడేవారికి దివ్య ఔషధం..!

Senior Citizens: సీనియర్ సిటిజన్లకి బంపర్‌ ఆఫర్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే రిటర్న్స్‌..!