
ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఎంతో అవసరం. ఎక్కువ మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నివారణకు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. చాలా మందికి బీట్రూట్ అంటేనే రక్తహీనత నివారణకు ముఖ్యమైన ఆహారంగా తెలుస్తుంది. నిజమే బీట్రూట్ లో ఐరన్ ఉంటుంది. కానీ బీట్రూట్ కన్నా ఇంకా ఎక్కువగా ఐరన్ కలిగిన కొన్ని అద్భుతమైన ఆహారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
టోఫు అనేది సోయా బీన్లతో తయారయ్యే ఒక ప్రొటీన్ పుష్కలమైన ఆహారం. ఇది శాకాహారులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల టోఫులో సుమారు 5.4 గ్రాముల ఐరన్ ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఐరన్‌తో పాటు క్యాల్షియం, ప్రోటీన్, ఇతర మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు శరీర శక్తిని పెంచుతుంది.
క్వినోవా అనేది గ్లూటెన్-ఫ్రీ ఆహారం. ఇది మామూలు ధాన్యాల కంటే పోషకాల పరంగా ఎంతో సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల క్వినోవాలో సుమారు 2.8 గ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే ఇందులో మెగ్నీషియం, ఫైబర్, మాంగనీస్ వంటి ఖనిజాలూ ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శక్తినిచ్చే ఆహారంగా పనిచేస్తుంది.
ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉండే ఆహారాల్లో డార్క్ చాక్లెట్ కూడా ఒకటి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఇందులో చక్కెర తక్కువగా ఉండే వేరియంట్లను మాత్రమే ఉపయోగించాలి. శరీరానికి శక్తిని ఇచ్చే మాదిరిగానే రుచి పరంగా కూడా బాగా నచ్చే ఆహారం ఇది.
ఈ చిన్న గింజలలో ఐరన్, జింక్, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని రోజూ కొంత తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్‌ను సహజసిద్ధంగా అందిస్తుంది.
రెడ్ మీట్ అనేది హీమ్ ఐరన్ సమృద్ధిగా ఉండే మాంసాహార ఆధారం. ఇది శరీరానికి సులభంగా ఐరన్‌ను అందిస్తుంది. అంతేకాదు ఇందులో ప్రోటీన్, బి-విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్యలు రావొచ్చు.
పాలకూర అనేది అన్ని ఆకుకూరల్లో అత్యంత ఆరోగ్యకరమైనది. ఇందులో ఐరన్‌తో పాటు విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. పాలకూర తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ ఉత్పత్తి మెరుగవుతుంది. ఇది రక్తంలో ఐరన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
చిన్నవిగా కనిపించే ఈ విత్తనాల్లో గొప్ప శక్తి ఉంటుంది. ఇవి ఐరన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు కలిగి ఉంటాయి. చియా సీడ్స్ తినడం ద్వారా శక్తి, తృప్తి, ఆరోగ్యాన్ని ఒకేసారి పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)