Beauty Tips: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోయారా.. పెరుగుతో ఇలా ఉపశమనం పొందండి..!

|

Apr 12, 2022 | 12:08 PM

Beauty Tips: వేసవిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, విటమిన్ B7 పుష్కలంగా ఉంటాయి. పెరుగు జుట్టుకి చాలా మేలు చేస్తుంది. దీనిని వెంట్రుకలకు

Beauty Tips: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోయారా.. పెరుగుతో ఇలా ఉపశమనం పొందండి..!
Yogurt
Follow us on

Beauty Tips: వేసవిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, విటమిన్ B7 పుష్కలంగా ఉంటాయి. పెరుగు జుట్టుకి చాలా మేలు చేస్తుంది. దీనిని వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. పెరుగులో చాలా విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చుండ్రు, దురదలను తొలగిస్తాయి. పెరుగు సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది. వారానికి రెండుసార్లు పెరుగును తప్పనిసరిగా ఉపయోగించాలి. పెరుగుతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. మీకు సమయం తక్కువగా ఉంటే సాధారణ పెరుగును జుట్టుకు పట్టించవచ్చు. కొద్దిసేపు మర్దన చేయాలి. తర్వాత 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత తలని గోరువెచ్చని నీటితో కడగాలి. మంచి ఉపశమనం దొరుకుతుంది. ఆలివ్ నూనె, తేనె కూడా జుట్టుకు మేలు చేస్తాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టుని పొడిబారకుండా చేస్తాయి. ఇందుకోసం మీరు అరకప్పు పెరుగు తీసుకుని అందులో 3 చెంచాల తేనె, 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.

పెరుగు, నిమ్మ, తేనెతో చేసిన హెయిర్ ప్యాక్ మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మృతకణాలు తొలగిపోయి పోషకాలు జుట్టు మూలాల్లోకి చేరుతాయి. పొడి, నిర్జీవమైన జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. దీని కోసం 2 టీస్పూన్ల తేనెలో కొద్దిగా నిమ్మ, 1 టీస్పూన్ తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఉపశమనం ఉంటుంది.

కొబ్బరి నూనెతో పెరుగు కలిపి అప్లై చేయవచ్చు. ఇది జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తుంది. లోపలి నుంచి జుట్టుని తేమ చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్‌ చేయడానికి 2 టీస్పూన్ పెరుగు, 1 టీస్పూన్ తేనె, కొబ్బరి నూనె బాగా కలపాలి. దీనిని జుట్టుకి పట్టించి బాగా మసాజ్ చేసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత తేలికపాటి వేడి నీటితో కడగాలి. జుట్టుకి మంచి షైనింగ్‌ వస్తుంది. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Cricket News: అద్భుతం.. వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు.. రెండు పరుగులు..!

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి 5 శాఖాహార ఆహారాలు.. ప్రతిరోజు తినాల్సిందే..!

Health Tips: అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!