Cervical Cancer: మహిళల్లో ఈ లక్షణాలు కనిపించినట్లయితే గర్భశయ క్యాన్సర్‌ కావచ్చు

| Edited By: Ravi Kiran

Apr 05, 2022 | 6:39 AM

Cervical Cancer: దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్ కేసులు మహిళల్లో రెండవ స్థానంలో ఉన్నాయి . అయితే సరైన సమయంలో లక్షణాలను గుర్తించడం ద్వారా..

Cervical Cancer: మహిళల్లో ఈ లక్షణాలు కనిపించినట్లయితే గర్భశయ క్యాన్సర్‌ కావచ్చు
Cervical Cancer
Follow us on

Cervical Cancer: దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్ కేసులు మహిళల్లో రెండవ స్థానంలో ఉన్నాయి . అయితే సరైన సమయంలో లక్షణాలను గుర్తించడం ద్వారా ఈ క్యాన్సర్‌ (Cancer)ను సులభంగా నివారించవచ్చు. వైద్యులు (Doctors) తెలిపిన వివరాల ప్రకారం.. హై రిస్క్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV ) వల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. రోగనిరోధక శక్తి ఉన్న మహిళలు ఈ వైరస్ నుంచి రక్షించుకోవచ్చు. అయితే ఈ వైరస్ ఎక్కువ కాలం తర్వాత బహిర్గతం కావడం వల్ల గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వినియోగించాల్సిన వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు దాని లక్షణాల గురించి కూడా సమాచారం ఇవ్వాలి.

రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని ఆంకాలజీ విభాగం డాక్టర్ వినీత్ తల్వార్ మాట్లాడుతూ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 10 నుండి 15 సంవత్సరాల వరకు క్యాన్సర్‌కు ముందు దశలోనే ఉంటుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశలోనే గుర్తించబడవు. దీనిని అధునాతన దశలో మాత్రమే గుర్తిస్తారు. అయితే మహిళలు క్రమం తప్పకుండా పాప్ స్మెర్ పరీక్ష చేయించుకుంటే, అలాగే, 30 ఏళ్లు పైబడిన మహిళలు హెచ్‌పివి పరీక్ష చేయించుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్‌ను సులభంగా గుర్తించవచ్చు అంటున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధం కలిగి ఉండటం కూడా గర్భాశయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌ఐపీతో బాధపడే మహిళలు, పరిశుభ్రత పాటించని మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.

ఇవి లక్షణాలు

☛ పీరియడ్స్ కాకుండా ఇతర రక్తస్రావం

☛ పీరియడ్స్ రాకుండా ఉండటం

☛ ఆకస్మిక బరువు నష్టం

☛ పొత్తి కడుపులో నిరంతరంగా నొప్పి

డాక్టర్ తల్వార్ ప్రకారం.. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి 9- 26 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు HPV వ్యాక్సిన్‌ను పొందాలి. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ నుండి 80 శాతం వరకు రక్షించగలదు. లైంగిక ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు ఈ టీకాను పొందడం మంచిది. టీకాలు వేసిన తర్వాత కూడా మహిళలు తమ స్క్రీనింగ్ చేయించుకోవడం కొనసాగించాలి. మహిళలు తమ పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. ప్రైవేట్ పార్ట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Fish Benefits: మీరు చేపలను తరచూగా తింటున్నారా..? అద్భుతమైన ఫలితాలు ఇవే..!

Healthy Kidneys: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా..?