Heart Disease: గుండె జబ్బుల విషయంలో మీకూ ఈ అపోహలు ఉన్నాయా.? చెక్‌ చేసుకోండి..

|

Oct 15, 2023 | 11:34 PM

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతోన్న వారు ఎక్కువవుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మందికి గుండె జబ్బుల విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇంతకీ గుండె జబ్బుల విషయంలో ఉన్న సాధారణ అపోహలు ఏంటి.? అసలు నిజాలు ఏంటి.? ఇప్పుడు చూద్దాం..

Heart Disease: గుండె జబ్బుల విషయంలో మీకూ ఈ అపోహలు ఉన్నాయా.? చెక్‌ చేసుకోండి..
Heart problems
Follow us on

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతోన్న వారు ఎక్కువవుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మందికి గుండె జబ్బుల విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇంతకీ గుండె జబ్బుల విషయంలో ఉన్న సాధారణ అపోహలు ఏంటి.? అసలు నిజాలు ఏంటి.? ఇప్పుడు చూద్దాం..

* గుండె జబ్బుల విషయంలో ఉన్న ప్రధాన అపోహ గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లో మాత్రమే వస్తుందనే భావనలో ఉంటారు. అయితే వయసు గుండె జబ్బులకు ప్రధాన కారణమే అయినప్పటికీ ఏ వయసులో వారైనా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నాఉ. జీవనశైలిలో మార్పులుతో పాటు ఇతర ఆరోగ్య పరిస్థితులు యువకుల్లో కూడా గుండె సమస్యలకు రావడానికి కారణంగా మారుతున్నాయి. దీంతో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఇక స్ట్రీలతో పోల్చితే పురుషులలో ఎక్కువగా గుండె జబ్బులు వస్తాయనే అపోహ కూడా ఉంది. అయితే లక్షణాల విషయంలో ఇద్దరి మధ్య తేడాలు ఉండొచ్చు కానీ, జబ్బు బారిన పడడానికి ఇద్దరిలో సమాన అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎవరికీ లక్షణాలు కనిపించినా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

* గుండె జబ్బు అనగానే చాలా మంది ఛాతిలో నొప్పినే ముఖ్య లక్షణంగా ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే అన్ని సందర్భాల్లో ఇది గుండె జబ్బుకు లక్షణం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఛాతి నొప్పితో పాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వికారం, తలతిరగడం, మెడ, దవడ, వెన్ను నొప్పి వంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలి.

* కుటంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు వస్తే ఇతరులకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఇందులో 100 శాతం నిజం ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. కుటంబంలో ఎవరైనా హృద్రోగాలతో బాధపడితే వారు సరైన జీవనశైలి పాటించడానికి, ముందస్తు హెల్త్‌ చెకప్స్‌ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావించాలి.

* ఇక చాలా మంది మందులు వాడితే చాలు గుండె జబ్బులు నయమవుతుందనే అపోహలో ఉంటారు. అయితే కేవలం మందులు వాడడమే కాకుండా జీవినశైలిలో మార్పులు చేసుకోవడం, యోగ, మెడిటేషన్‌ వంటివి చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందుల విషయంలో మాత్రం మీ వైద్యుడి సూచనలు పాటించడం సూచించదగ్గ అంశం.

ఈ అపోహలను పక్కనపెట్టి గుండె ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అప్రమత్తతో ఉండాలి. నిత్యం గుండె ఆరోగ్యం ఎలా ఉందో చెక్‌ చేసుకోవడానికి రెగ్యులర్‌ చెక్‌ అప్‌లు, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..