Heart Attack: గుండెపోటుకు ముందు శరీరంలో కనిపించే లక్షణాలివే.. మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

|

Mar 24, 2023 | 9:26 PM

చాలా మంది అతి చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆశ్యర్యమేమంటే నిండా 30 సంవత్సరాలు కూడా లేనివారిలో సైతం రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సమస్యలే కాక గుండెపోటు..

Heart Attack: గుండెపోటుకు ముందు శరీరంలో కనిపించే లక్షణాలివే.. మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Heart Attack
Follow us on

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమనేది పెద్ద సవాలుగా మారింది. చాలా మంది అతి చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆశ్యర్యమేమంటే నిండా 30 సంవత్సరాలు కూడా లేనివారిలో సైతం రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సమస్యలే కాక గుండెపోటు సమస్య బారిన కూడా పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం చేయకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు చేయడం కూడా గుండెపోటుకు కారణం కావచ్చట. అయితే గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో కొన్ని రకాల లక్షణాలు, మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మరి ఆ సమయలో శరీరంలో ఏం జరుగుతుంది, ఏయే లక్షణాలు కనిపిస్తాయి.. ? ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటుకు అర గంట ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి:

  • గుండె భారంగా, అసౌకర్యంగా అనిపించినా కూడా వైద్యుడిని సంప్రదించాలి.
  • రక్తం సరాఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  • తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నా., అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాల్సిందే. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.
  • తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు వస్తున్నా కూడా అశ్రద్ధ చేయకూడదు.
  • వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండె నొప్పికి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
  • మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.
  • గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ లక్షణం కనిపిస్తే తప్పక అప్రమత్తం కావాలి.
  • మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి కావడం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండె పోటుకు సంకేతాలుగా భావించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..