Health Tips: బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్య. ఇది తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి పెరుగుతున్న బరువును నియంత్రించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాయామాలు, సరైన డైట్ పాటించాల్సి ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువు తగ్గే విషయంలో చాలామంది వారికి నచ్చిన అలవాట్లని పాటిస్తున్నారు. దీనివల్ల పోషకాహార లోపానికి గురవుతున్నారు. తల తిరగడం, బలహీనత వంటి సమస్యలని ఎదుర్కొంటున్నారు. కానీ సరైన ఆహారాలు తీసుకుంటే ఈ టెన్షన్ ఉండదు. వేసవిలో కొన్ని ఆహారాలు తింటే అస్సలు బరువు పెరగరు. ఎందుకంటే బరువు పెంచే పోషకాలు ఇందులో ఉండవు. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. పెరుగు
పెరుగు తేలికపాటి ఆహారంగా చెబుతారు. వైద్యులు రోజుకొకసారి పెరుగు తినాలని సూచిస్తారు. పెరుగు తింటే బరువు తగ్గుతారు. ఇందులో భాస్వరం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది మీ దంతాలు, ఎముకలను బలంగా చేస్తుంది. ఇందులో ఉండే సూక్ష్మజీవులు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. పెరుగు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగు వేసవిలో శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచుతుంది.
2. దోసకాయ
ఎండాకాలం అయినా చలికాలమైనా దోసకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల శరీరంలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. రోజు మొత్తం శరీరంలో శక్తి ఉంటుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
3. నిమ్మకాయ
నిమ్మకాయ బరువు తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. దీనిని ప్రాచీన కాలం నుంచి వాడుతున్నారు. అంతేకాదు దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లోపం కూడా తీరుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్య తరచుగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఈ పరిస్థితిలో వారు నిమ్మరసంతో చేసిన ఆహార పదార్థాలని తీసుకోవడం ద్వారా దాహం తీరుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి కాకుండా విటమిన్ బి-6, ఫోలేట్, విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తాయి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.