ఆరోగ్యకరమైన పంటిపై ఎనామెల్ తెల్లగా ఉంటుంది. కానీ కాలక్రమేణా ఎనామెల్ విచ్ఛిన్నమై డెంటిన్‌ను బహిర్గతం చేస్తుంది. దీనివల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. మనం తినే ఆహారం కూడా మన దంతాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రెడ్ వైన్, కలర్ సాస్, సోడాస్, టీ, కాఫీలు, మామిడి, చక్కెర వంటివి బాగా పళ్లపై ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.