AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే

వేసవి కాలం వచ్చిందంటే చాలు రంగురంగుల పండ్లు మార్కెట్లో సందడి చేస్తూ ఉంటాయి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్ల గురించి అందరికీ తెలుసు, కానీ ఎంతో రుచికరంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మల్బరీ పండ్ల గురించి చాలా మందికి తెలియదు. మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా తెలుసుకుందాం..

సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే
Sweet Summer Mulberries1.jpg
Nikhil
|

Updated on: Apr 29, 2026 | 6:45 AM

Share

చిన్నగా, తియ్యగా ఉండే మల్బరీ పండ్లు కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. పూర్వ కాలం నుండి వివిధ దేశాల్లో వీటిని ఔషధంగా వాడుతున్నారంటే వీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆధునిక ఆహార నిపుణులు కూడా మల్బరీని ఒక సూపర్ ఫుడ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ పండ్లలో ఉండే పెక్టిన్ అనే పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యానికి తోడుగా

మల్బరీ పండ్లలో ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారిని వేధించే కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడానికి మల్బరీ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినడానికి భయపడుతుంటారు, కానీ మల్బరీ పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను సమన్వయం చేస్తాయి. అందుకే టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని నిశ్చింతగా తీసుకోవచ్చు.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మధుమేహ వ్యాధి నివారణకు వాడే మందుల తయారీలో మల్బరీ పండ్ల సారాన్ని ఉపయోగిస్తున్నారంటే ఇవి ఎంత శక్తివంతమైనవో అర్థం చేసుకోవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మల్బరీ ఒక వరం లాంటిది. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తం పట్టేలా చేస్తుంది. రోజూ కొన్ని మల్బరీ పండ్లు తినడం వల్ల అలసట తగ్గి శరీరం ఉత్సాహంగా మారుతుంది.

మెదడు ఆరోగ్యం

మల్బరీ పండ్లలో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది, ఇది మలబద్ధకం సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో మల్బరీ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. చర్మం ముడతలు పడకుండా, తాజాగా ఉండేలా చేయడంలో ఇవి సహాయపడతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచడంలో మల్బరీ పండ్లు తోడ్పడతాయి.

మల్బరీ పండ్లు కేవలం పండు రూపంలోనే కాకుండా సలాడ్లు, జ్యూస్‌లు లేదా స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎండాకాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మల్బరీ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. సహజ సిద్ధంగా లభించే ఈ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడటంలో ఇవి ముందుంటాయి. కాబట్టి ఈ వేసవిలో మల్బరీ పండ్లు దొరికినప్పుడు వాటిని అస్సలు వదులుకోవద్దు. ప్రకృతి ప్రసాదించిన ఈ మధురమైన పండును తిని మీ ఆరోగ్యాన్ని భద్రపరుచుకోండి.

Follow Us