
బాదం పప్పులు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాల్లో ఒకటి. వీటిని నానబెట్టి తినడం ద్వారా శరీరానికి మంచి శక్తిని ఇవ్వవచ్చు. బాదంలో ఉండే సహజమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ముఖ్యమైనవి. నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ E, ఒమేగా 3 కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో, మానసికంగా ఉత్సాహంగా ఉండేలా చేయడంలో ఉపయోగపడతాయి.
బాదంలో ఉండే మంచి కొవ్వులు, ముఖ్యంగా మోనోసాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నానబెట్టిన బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
నానబెట్టిన బాదం మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో చక్కెరను గ్రహించే ప్రక్రియను నెమ్మదిగా చేస్తాయి. దీని వల్ల గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
బాదంలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బాదంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. రోజూ నానబెట్టిన బాదం లను తినడం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
విటమిన్ E, జింక్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బాదం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఇవి సహాయపడతాయి.
బాదంలో ఉండే ప్రోటీన్, ఫైబర్ శరీరానికి త్వరగా నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. ఆకలిని అదుపు చేయడంలో సహాయపడడం వల్ల ఎక్కువగా తినడం తగ్గుతుంది. దీని వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ E చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తూ చర్మానికి తాజాగా ఉండే మెరుపును ఇస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)