Sunstroke: వడదెబ్బ లక్షణాలు.. తీసుకోవాల్సిన నివారణ పద్దతులు తెలుసుకోండి..!

|

Apr 12, 2022 | 9:47 AM

Sunstroke: ఎండాకాలంలో వేడివల్ల చాలామందిలో మైకం, భయం, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లకూడదు.

Sunstroke: వడదెబ్బ లక్షణాలు.. తీసుకోవాల్సిన నివారణ పద్దతులు తెలుసుకోండి..!
Sunstroke
Follow us on

Sunstroke: ఎండాకాలంలో వేడివల్ల చాలామందిలో మైకం, భయం, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లకూడదు. ముఖ్యంగా పగటిపూట 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇల్లు లేదా కార్యాలయంలో ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో సూర్య కిరణాల వేడి ఎక్కువగా ఉంటుంది. అలసిపోయి కిందపడిపోవడం, చంచలంగా అనిపించడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా సురక్షితంగా కాపాడుకోవచ్చు. శరీరం ఎక్కువగా అలసిపోకుండా చూసుకోండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ లేదా లస్సీని తీసుకోండి. తల, చెవులను కప్పుకున్న తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. మీకు కావాలంటే గొడుగు ఉపయోగించండి. వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ నీళ్లలో కాస్త బ్లాక్ సాల్ట్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే మంచిది. ఏసీ నుంచి డైరెక్ట్‌గా ఎండలోకి వెళ్లవద్దు. అలాగే ఎండలో తిరిగివచ్చి డైరెక్ట్‌గా AC గదికి వెళ్లవద్దు. కొంచెం సమయం తీసుకున్న తర్వాత వెళ్లాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

వడదెబ్బ లక్షణాలు..

1. ఎండదెబ్బకి గురైనట్లయితే సరైన చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరిస్థితి దిగజారకుండా ఉంటుంది.

2. కొంచెం మైకంతో పాటు తల తిరుగుతున్న అనుభూతి ఉంటుంది.

3. తలనొప్పి, మైకం ఉంటుంది.

4. ఏకాగ్రత ఉండదు.

5. బలహీనత, కండరాల నొప్పి

6. విపరీతమైన దాహం, కడుపులో తిప్పుతున్న అనుభూతి

7. వాంతులు, విరేచనాలు, అతిసారం

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Back Pain: నడుంనొప్పులకి శస్త్రచికిత్స తప్పనిసరి కాదు.. కొన్నిటిని ఇలా తగ్గించుకోవచ్చు..!

Health Tips: అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Summer Tips: వేసవిలో చియా సీడ్స్‌, మజ్జిగ వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి ఉపశమనం..!