మానసికంగా ధృఢంగా ఉంటే ఎలాంటి సమస్య నుంచి అయినా ఇట్టే బయటపడతామని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ బరువు తగ్గాలి అనే ఆలోచన..నలుగురిలో అందంగా కనపించాలనే స్పృహ మనలో మాత్రం మానసిక ఆందోళన కలిగిస్తుంది. అలాంటి ఆందోళన నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..
ఆదివారం అంటేనే ఇంట్లో వాళ్లంతా సరదాగా గడిపే రోజు. ఆ రోజు ఇంట్లో అనేక రకాలైన స్పెషల్స్ వండుకుని ఇంట్లోని వారంతా ఓ చోట కూర్చొని రుచిని ఆశ్వాదిస్తూ తింటూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో డైట్ ఫాలో అయ్యే వారు ఇబ్బంది పడుతుంటారు. వారికి మనస్సులో తినాలని ఉన్నా ఒకవేళ తింటే మళ్లీ ఆ క్యాలరీలను కరిగించడానికి ఎక్స్ ట్ట్రా వర్క్ అవుట్స్ చేయాలనే అనే ఆలోచన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఆలోచలనతో మనం ప్రశాంతంగా మన ఇంట్లో వాళ్లతో ఎంజాయ్ చేయలేము. అయితే నిపుణులు మాత్రం సెలవు రోజుల్లో ఎక్కువ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని…అయితే కొన్ని కొన్ని మార్గాల ద్వారా మన రోజువారి డైట్లో ఎలాంటి మార్పులు లేకుండా మన బరువు తగ్గే విధానాన్ని కొనసాగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రఖ్యాత న్యూట్రినిస్ట్ లు సైతం ఏదో ఓ రోజు ఎలాంటి భిన్నమైన ఆహారం తీసుకున్నా ఇబ్బంది ఉండదని అంటున్నారు. కానీ మన మనస్సులో మాత్రం ఎక్కువ తినేస్తున్నామనిలో ఆందోళనలో ఉంటాం. అలాంటి ఆందోళన నుంచి ఎలా బయటపడాలో ఇప్పడు మనం తెలుసుకుందాం.
ఆహార పరిమితులు వద్దు
అందరితో ఆనందంగా ఉన్నప్పుడు మనం మాత్రమే వేరేగా నేను ఇది..తినను..అది తినను అని అంటుంటే అందరి మూడ్ డిస్ట్రబ్ అవుతుంది. కాబట్టి మీరు ఆహారాన్ని తీసుకునే విషయాల్లో మీరు ఎలాంటి పరిమితులు పెట్టవద్దు. కొంచెం మంది నేను ఉదయాన్ని ఎక్కువ తింటాను కాబట్టి..క్యాలరీల మేనేజ్మెంట్ కోసం ముందు రోజు రాత్రి తినకుండా ఉంటారు. లేదా రాత్రి ఎక్కువ తిన్నాను కాబట్టి ఉదయాన్నే టిఫిన్ చేయరు..ఇలాంటి చర్యలతో మన శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయి. సో నలుగురిలో ఉన్నప్పుడు ఇలాంటి పరిమితులు అస్సులు పాటించకూడదని నిపుణులు చెబుతున్నారు.
రుచిని ఆశ్వాదించడం
ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యుల్లో ఆనందంగా గడిపే సమయంలో తినే తిండిపై దృష్టి పెడుతూ ఆ రుచిని ఆశ్వాదించడం ద్వారా మన బ్రెయిన్ నుంచి ఎక్కువ తింటున్నాం అనే ఆలోచన నుంచి దూరంగా ఉండవచ్చు. అందరితో ఎలా తింటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నామని విషయంపై చర్చిస్తూ ఉంటే మన ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఎలాంటి పదార్థాలు తినాలని అనిపిస్తే వాటిని తినేయాలని నిపుణులు చెబుతున్నారు.